అమరావతిలో ప్రధాని సభ వేళ..పహల్గామ్‌లో ఊహించని పరిణామం
ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి గురించి తెలిసిన విషయమే. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 26 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఉగ్రదాడి తర్వాత పహల్గామ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఉగ్రదాడికి ముందు పహల్గామ్ పర్యాటకులకు స్వర్గధామంగా ఉండేది. రోజుకే 5000 మంది కాశ్మీర్ అందాలను చూడటానికి పహల్గామ్‌కు వచ్చేవారు. టూరిస్టుల పుణ్యామా అంటూ స్థానికులకు కూడా బాగానే ఉపాధి దొరికేది. అయితే దాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పహల్గామ్ రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అయితే పహల్గామ్‌లో సానుకూల వాతవరణం కనిపిస్తుంది. పహల్గామ్‌లో టూరిస్టుల తాకిడి కాస్తా పెరిగింది. ప్రస్తుతం 500 నుంచి 1000 మంది లోపు టూరిస్టులు పహల్గామ్‌ను సందర్శిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా పహల్గామ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పహల్గామ్ వస్తోన్న టూరిస్టులకు స్థానికులు పూలతో స్వాగతం పలుకుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటన భారత్ ప్రజల మనోధైర్యానికి సాక్షిగా నిలిచింది. ఎక్కడైతే ఉగ్రదాడి జరిపి ఈ ప్రదేశానికి ఎవరు రావద్దు, కాశ్మీర్ మాది అనే సంకేతాలు ఇవ్వడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం ఫలించలేదనే చెప్పాలి.
పాక్ ఎంత ప్రయత్నించినా.. కాశ్మీర్ మా సొంతం.. మేము వస్తాం అని ధైర్యంగా జమ్మూకశ్మీర్ లోని పహల్గాం పర్యాటక ప్రదేశాలకు.. టూరిస్టులు వస్తున్నారు. మన దేశ పర్యటకులే కాదు.. విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు సైతం, అక్కడి ప్రకృతిని ఆశ్వాదిస్తున్నారు. పర్యటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 26 మంది ప్రాణాలు బలిగొన్నప్పటికీ.. సందర్శకులపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించటం లేదు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు పహల్గాంలోని పర్యాటకప్రాంతాల్లో విహరిస్తున్నారు. భయం లేకుండా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications