coronavirus: 30 రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్, 10కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య పదికి చేరింది. సోమవారం ఒక్కరోజు ముగ్గురు చనిపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకిన వారి సంఖ్య 499కి చేరింది. 30 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలిత రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్ర్యాల కర్ఫ్యూ విధించాయి. అయినా జనం రోడ్లపైకి రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ అసహనం వ్యక్తం చేశారు. ప్రజల తీరు బాగోలేదని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

 లాక్ డౌన్..

లాక్ డౌన్..

వైరస్ ప్రబలడంతో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాయి. సరిహద్దులు మూసివేసి.. ప్రజలను ఇంట్లోనే ఉండాలని సూచించారు. దేశంలో 28 రాష్రాలు, 8 కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలు ఉన్న సంగతి తెలిసిందే. అంటే ఆరు రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో మాత్రమే పరిస్థితి స్థిమితంగా ఉందని అర్థమవుతోంది.

 ముంబైలో ఇద్దరి మృతి

ముంబైలో ఇద్దరి మృతి

ముంబైలో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి సోమవారం ముంబైలో చనిపోయారు. అతని కిడ్నీ పనిచేయక చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు. కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు అతనికి కరోనా వైరస్ టెస్ట్ చేయగా నెగిటివ్ అని వచ్చింది. దీంతో అతనిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆధివారం రాత్రి చనిపోయారు. తర్వాత పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. ముంబైలో చనిపోయిన వారి సంఖ్య రెండుకి చేరుకున్నది.

 హిమాచల్, బెంగాల్‌లో ఒక్కొక్కరు

హిమాచల్, బెంగాల్‌లో ఒక్కొక్కరు

సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు చనిపోయారు. 69 ఏళ్ల వృద్దుడు వైరస్ సోకి చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఇతని మృతితో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకున్నది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఇది బెంగాల్‌లో మొదటి కరోనా మరణం అని అధికారులు పేర్కొన్నారు. ఇటలీ నుంచి కుటుంబంతో సహా కోల్‌కతా రాగా.. అతని కుమారుడు మాత్రం బాగానే ఉన్నారు.

మరణ మృదంగం

మరణ మృదంగం

పాట్నాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఖతార్ నుంచి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటు చనిపోయారు. మృతిచెందాక కూడా అతని రక్త నమూనాలు సేకరించిన వైద్యులు.. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. కర్ణాటక, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లో ఒక్కొక్కరు కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడు మృతిచెందారు. ఇటలీ టూరిస్ట్ మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్న పుణెలో ఒకరు చనిపోవడంతో అది ఆరుకి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+