Lockdown love: బీజేపీ అమ్మాయి, కాంగ్రెస్ అబ్బాయి లవ్ మ్యారేజ్, ఇద్దరూ లీడర్స్, కేసు!, ఎందుకంటే ?
బెంగళూరు/ కలబురిగి: ప్రేమ గుడ్డిది అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రేమ నిజంగానే గుడ్డిది, ఎందుకంటే ప్రేమ ఎక్కడ ? ఎప్పుడు ? ఎలా ? పుడుతుందో ఇంత వరకు కచ్చితంగా చెప్పిన మహానుభావుడు కాని, సైంటిస్టులు కాని లేరు. శుత్రుదేశాలతో మనోళ్లు వివాహ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక రాజకీయ నాయకులు అయితే ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పోట్లాడుకుంటుంటారు. అంతెందుకు కలలో కూడా కొందరు రాజకీయ నాకులు నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకుంటుంటున్నారు. రాజకీయంగా బధ్ధశత్రువులుగా ముద్రపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువతి, యువకుడు వారి రాజకీయాలు పక్కనపెట్టి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఒకే ప్రాంతంలో రాజకీయ శత్రువులుగా ఉన్న ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అయితే కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న ప్రజాప్రతినిధుల మీద లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

కర్ణాటకలో కలసిపోయే రాజకీయాలు
కర్ణాటకలోని కొందరు రాజకీయ నాయకులకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజకీయాలు వేరు, స్నేహం వేరు, అనే చెప్పి ఆమాటను కచ్చితంగా ఆచరించే నాయకులు చాలా మంది ఉన్నారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రస్తుత సీఎం బీఎస్ యడియూరప్ప, మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకున్నారు. ఇక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి సీఎంగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన టైంలో సిద్దరామయ్య స్వయంగా ఆ కార్యక్రమానికి హాజరైనారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి నిశ్చితార్థం వేడుకలకు సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది హాజరైనారు. ఇలా చాలా శుభకార్యాలకు పార్టీలకు అతీతంగా కర్ణాటకలోని రాజకీయ నాయకులు హాజరౌతుంటారు.

బీజేపీ అమ్మాయి, కాంగ్రెస్ అబ్బాయి
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని అఫజలపుర్ లోని చౌడాపుర తాలుకా పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసిన రుక్మిణి జమాదార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక కరజగి తాలుకా పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పోటీ చేసిన భీమాశంకర్ బీజేపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అయ్యారు.

నువ్వా.... నేనా...... !
కలబురిగి జిల్లాలోని అఫజలపుర్ తాలుకా పంచాయితీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పంజాయితీ సభ్యులు నువ్వా... నేనా అంటూ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. మెజారిటీ పంచాయితీ సభ్యుల మద్దతుతో అధ్యక్ష పదవిలో రుక్మిణి కుర్చున్నారు. అయితే ఉపాధ్యక్ష పదవి మాత్రం బీజేపీకి దక్కలేదు. అఫజలపుర తాలుకా పంచాయితీ ఉపాధ్యక్షుడిగా భీమాశంకర్ ఎన్నిక అయ్యారు.

ఎంత వరకో అంత వరకే ఫ్రెండ్
అఫజలపుర్ తాలుకా పంచాయితీ సభలు, సమావేశాల్లో రుక్మిణి, భీమాశంకర్ ఒకరి పార్టీ మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆ ఆరోపణలు, విమర్శలు పంచాయితీ కార్యాలయం గొడల మధ్య వరకే పరిమితం అయ్యాయి. అయితే ఇదే సమయంలో రుక్మిణి, భీమాశంకర్ మాటామాటా కలిపి స్నేహితులు అయ్యారు.

నువ్వులేకనేనులేను
పార్టీలు వేరే అయినా రుక్మిణ, భీమాశంకర్ ల స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. పరస్పరం రాజకీయ వైరం ఉన్నా వారి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. సాంప్రధాయబద్దంగా భీమాశంకర్ కుటుంబ సభ్యులు నేరుగా రుక్మిణి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు. ఒకే తాలుకా పంచాయితీ అధ్యక్ష, ఉపాధ్య పదవుల్లో ఉన్న రుక్మిణి, భీమాశంకర్ పెళ్లికి వారి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

పెళ్లిసందడి....... హంగామా అదుర్స్
పెద్దల సమక్షంలో సోమవారం రుక్మిణి, భీమాశంకర్ ఒక ఇంటివారు అయ్యారు. రుక్మిణి, భీమాశంకర్ పెళ్లికి కలబురిగి జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కొందరు ఎమ్మెల్యేలు హాజరైనారు. రుక్మిణి, భీమాశంకర్ పెళ్లి సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి రాజకీయాలు పక్కనపెట్టి ఒక్కటి అయ్యారు. రాత్రి గ్రాండ్ గా రిసెప్షన్ జరిగింది. రంగరంగ వైభంగా విందు ఏర్పాటు చేశారు. మా పెళ్లికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయాలు వేరు, సంసారం వేరు అని రుక్మిణి, భీమాశంకర్ తేల్చి చెప్పారు. అయితే మంగళవారం రాత్రి రిసెప్షన్ ఫోటోలు బయటకు రావడంతో అధికారులు రుక్మిణి, భీమాశంకర్ కు ఊహించని షాక్ ఇచ్చారు.
Recommended Video

కరోనా, లాక్ డౌన్ దెబ్బతో విచారణ
రుక్మిణి, భీమాశంకర్ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వారి రాజకీయ వైర్యాలు పక్కనపెట్టి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో కలబురిగి జిల్లా కలెక్టర్ బి. శరత్ నవదంపతులకు పెద్ద షాక్ ఇచ్చారు. అఫజల్ పుర్ తాలుకా పంచాయితీ అధ్యక్షరాలు రుక్మిణి, ఉపాధ్యక్షుడు భీమాశంకర్ ల వివాహం రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవడానికి మాత్రమే తాము అనుమతి ఇచ్చామని, అయితే వారు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయని జిల్లా కలెక్టర్ అన్నారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని, కరోనా వైరస్ లాంటి అంటు వ్యాధులు వ్యాపించడానికి పరోక్షంగా కారణం అయ్యారని, దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని కలబురిగి జిల్లా కలెక్టర్ శరత్ మీడియాకు చెప్పారు. నవదంపతులు రుక్మిణి, భీమాశంకర్ తో పాటు రిసెప్షన్ కు హాజరైనా వారు దాదాపుగా ఎవ్వరూ ముఖాలకు మాస్క్ లు వేసుకోలేదని, కనీసం భౌతికదూరం పాటించలేదని బయటకు వచ్చిన రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతోంది.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications