lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !
చెన్నై/కన్యాకుమరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు సొంతంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్ కు వస్తున్న అందమైన అమ్మాయిలు, వివాహిత మహిళలతో తన భర్త ఎక్కువ చనువుగా ఉంటున్నాడని, నిత్యం సెల్ ఫోన్ లో అసభ్యకరమైన పోర్న్ వీడియోలు చూస్తున్నాడని, మహిళలతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడని భార్య గొడవ పెట్టుకుంది. దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. తాను ఎవరితో తిరిగితే నీకెందుకు అంటూ భర్త ఎదురుతిరిగాడు. భార్య, ఆమె చెల్లెలు, కుటుంబ సభ్యులు కలిసి భర్తను చాకచక్యంగా చంపేశారు. ఇప్పుడు సూపర్ మార్కెట్ యజమాని హత్యకు గురి కావడంతో అతనితో మొబైల్ లో చాటింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకున్న మహిళలు హడలిపోతున్నారు.

చెన్నై కాలేజ్ లో లవ్
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ఆర్ కే నగర్ నివాసి కార్తి అలియాస్ కార్గి (35), తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తాండం సమీపంలోని నిత్తిరావిపై పునితోమస్ నగర్ కు చెందిన జోస్పిన్ (30) అనే యువతి ప్రేమించుకున్నారు. చెన్నైలో ఉంటున్న సమయంలో కుటుంబ సభ్యులకు నచ్చచెప్పిన జోస్పిన్ తన ప్రియుడు కార్గిని వివాహం చేసుకుంది. కార్గి, జోస్పిన్ దంపతులకు 9, 4 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు.

సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు
కుమార్తె జోస్పిన్ ను వివాహం చేసుకున్న అల్లుడు కార్గి జీవితంలో స్థిరపడాలని ఆమె తండ్రి జాయ్ పాయ్ దుత్తూరులో ఓ సూపర్ మార్కెట్ పెట్టించి వ్యాపారం చేసుకోవాలని చెప్పాడు. సూపర్ మార్కెట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో సూపర్ మార్కెట్ కు వచ్చి వెలుతున్న అందమైన అమ్మాయిలు, వివాహిత మహిళలతో కార్గి పరిచయం పెంచుకున్నాడు.

మొబైల్ లో పోర్న్ వీడియోలు, చాటింగ్ లు
సూపర్ మార్కెట్ వచ్చి వెళ్లేవారితో పరిచయం పెంచుకున్న కార్గి వారితో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. తరువాత నిత్యం మొబైల్ లో పోర్న్ వీడియోలు చూడటంతో, మహిళలు, అమ్మాయిలతో చాటింగ్ చెయ్యడం కార్గికి దినచర్యలో ఎక్కువ భాగమైపోయింది. ఇదే విషయంలో నిత్యం జోస్పిన్, కార్గి దంపతుల మద్య గొడవలు జరిగేవి.

ఫ్యామిలీ ఎంట్రీతో సీన్ రివర్స్
కార్గి, జోస్పిన్ దంపతుల మధ్య రోజురోజుకు గొడవలు ఎక్కువ కావడంతో ఆమె తండ్రి జాయ్ పాయ్, సోదరుడు జస్టిన్, సోదరి ఎంటర్ అయ్యారు. వెంటనే సూపర్ మార్కెట్ క్లోజ్ చేసి తనతో పాటు చెన్నై వచ్చేయాలని కార్గి పట్టుబట్టాడు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఎక్కువ సేపు ఇంట్లోనే ఉంటున్న కార్గి, జోస్పిన్ దంపతుల మధ్య గొడవ మరింతఎక్కువ అయ్యాయి. ఆ సమయంలో సహనం కోల్పోయిన భార్య జోస్పిన్, మామ జాయ్ పాయ్, బావమరిది జస్టిన్, ఆమె సోదరికి కలిసి కార్గిని చితకబాది చంపేశారు.

ఆత్మహత్య నాటకం !
కార్గిని హత్య చేసిన అతని భార్య జోస్పిన్, ఆమె కుటంబ సభ్యులు అతనిని ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేశారు. అనుమానాస్పదంగా ప్రవర్థిస్తున్న జోస్పిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ సమయంలో జరిగిన విషయం మొత్తం చెప్పిన జోస్పిన్ తన భర్త కార్గిని హత్య చేశామని అంగీకరించింది. కార్గి హత్య కేసులో భార్య జోస్పిన్, ఆమె తండ్రి జాయ్ పాయ్, సోదరుడు జస్టిన్ తో పాటు ఆమె సోదరిని అరెస్టు చేశామని కన్యాకుమరి పోలీసులు తెలిపారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications