చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: భార్యపై అనుమానం, తల్లి, బిడ్డ సజీవదహనం, లాక్ డౌన్ దెబ్బతో రెండో భర్త, కూతురు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మధుర వాయిల్: భార్య అక్రమ సంబంధం విషయంలో అనుమానం పెనుభూతమైయ్యింది. రెండవ భార్య, కొడుకు, కూతురు నిద్రపోతున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త వారిలో ఇద్దరిని సజీవదహనం చేశాడు. లాక్ డౌన్ సందర్బంగా భార్య, కొడుకు ఇంట్లోకి రానివ్వలేదని, ఖర్చులకు డబ్బులు కూడా లేవని కోపంతో భర్త అన్నంత పని చేశాడు. జీవితాంతం తోడు ఉంటానని నమ్మించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న భార్యతో పాటు ఆమె కొడుకు సజీవదహనం అయ్యారు. కుమార్తె చావుబతుల మధ్యపోరాడుతోందని పోలీసులు తెలిపారు.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

మొదటి భర్తను గాలికి వదిలేసింది

మొదటి భర్తను గాలికి వదిలేసింది

పశ్చిమ బెంగాల్ లోకి కోల్ కతాకు చెందిన కారోసా బేగం (40) ఇంతకు ముందే వివాహం అయ్యింది. కారోసా బేగం మొదటి భర్తతో కాపురం చేసే సమయంలోనే అగ్రం ఆలీ (21), 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే మొదటి భర్తను గాలికి వదిలేసిన కారోసా బేగం నాలుగు సంవత్సరాల క్రితం మక్బూల్ ఆలీ (40) అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.

రెండో భర్తతో చెన్నైలో కాపురం

రెండో భర్తతో చెన్నైలో కాపురం

కోల్ కతా నుంచి రెండో భర్త మక్బూల్ ఆలీ, కుమారుడు అగ్రం ఆలీ, కుమార్తెతో కలిసి కరోసా బేగం చెన్నై చేరుకుని అక్కడి మధుర వాయిల్ ప్రాంతంలో కాపురం పెట్టింది. మొదటి భర్తకు పుట్టిన కుమారుడు అగ్రం ఆలీ, 13 ఏళ్ల కుమార్తె తమతో ఉండటానికి కరోసా బేగం రెండో భర్త మక్బూల్ ఆలీ గతంలోనే అంగీకరించాడు.

 లాక్ డౌన్ తో తేడా వచ్చింది

లాక్ డౌన్ తో తేడా వచ్చింది

చెన్నై చేరుకున్న తరువాత కారోసా బేగం రెండో భర్త మక్బూల్ ఆలీ చిన్నచిన్న పనులు చేస్తుండేవాడు. కారోసా బేగం కుమారుడు అగ్రం ఆలీ వేలప్పన్ చావడి ప్రాంతంలో షూలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ సందర్బంగా కొడుకు అగ్రం ఆలీ పని చేస్తున్న కంపెనీ మూసివేయడం, రెండో భర్త మక్బూల్ ఆలీ సక్రమంగా పనికి వెళ్లి డబ్బులు తీసుకురాకపోవడంతో కారోసా బేగం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనింది.

ఇంట్లో నుంచి రెండో భర్తకు గేట్ పాస్

ఇంట్లో నుంచి రెండో భర్తకు గేట్ పాస్

పనీపాటకు వెళ్లకుండా ఇంత కాలం కారోసా బేగం, ఆమె కుమారుడు అగ్రం ఆలీ సంపాధించిన డబ్బులతో మక్బూల్ ఆలీ మద్యం సేవించి తాగితందనాలు ఆడుతున్నాడు. ఈ విషయంపై కారోసా బేగం, మక్బూల్ ఆలీ దంపతుల మద్య అనేకసార్లు గొడవలు జరిగాయి. ఆ సందర్బంలో నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని భార్య కారోసా బేగంపై మక్బూల్ ఆలీ గొడవపెట్టున్నాడు. రెండు నెలల క్రితం మక్బూల్ ఆలీని ఆమె భార్య కారోసా బేగం ఇంటి నుంచి బయటకు గెంటేసింది.

ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

తనను రెండు నెలల నుంచి ఇంట్లోకి రానివ్వని భార్య కారోసా బేగం, ఆమె కొడుకు అగ్రం ఆలీ మీద మక్బూల్ ఆలీ రగిలిపోయాడు. తనను ఇంటి నుంచి బయటకు గెంటేసిన భార్య కారోసా బేగం వేరే వ్యక్తిని ఇంటికి పిలిపించుకుంటుందని మరింత అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి భార్య కారోసా బేగం, కొడుకు అగ్రం ఆలీ, 13 ఏళ్ల కుమార్తె ఇంటిలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఇంట్లో పెట్రోల్ పోసిన మక్బూల్ ఆలీ నిప్పంటించి ఇంటి బయట తాళం వేసి పరారైనాడు.

Recommended Video

Nara Lokesh About Electricity Bills Hike In Andhra pradesh | కరెంటు బిల్లు చూస్తే భయమేస్తుంది
భార్య, కొడుకు సజీవదహనం

భార్య, కొడుకు సజీవదహనం

కారోసా బేగం, ఆమె పిల్లలు మంటలు తట్టుకోలేక ఆర్తనాదాలు చెయ్యడంతో చుట్టుపక్కల వారు విషయం గుర్తించి తలుపులు పగలగొట్టి వారిని కీల్పకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కారోసా బేగం, ఆమె కొడుకు అగ్రం ఆలీ మరణించారని, 13 ఏళ్ల కుమార్తె చావుబతుల మధ్య పోరాడుతుందని, పరారైన మక్బూల్ ఆలీ కోసం గాలిస్తున్నామని మధుర వాయిల్ పోలీసులు తెలిపారు. ఇంట్లోకి రానివ్వలేదని కోపంతోనే తమకు రెండో భర్త మక్బూల్ ఆలీ పెట్రోల్ పోసి నిప్పంటించాడని కారోసా బేగం చెప్పిందని పోలీసులు తెలిపారు. అయితే కారోసా బేగం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని మక్బూల్ ఆలీ నిత్యం గొడవపడేవాడని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు అంటున్నారు.

English summary
Lockdown: Wife and Son burned alive in Chennai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X