సభలో సమైక్యం, వాయిదాలు: రిజైన్‌కు ఎంపీల మొగ్గు

రాష్ట్ర విభజనను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం ఉదయం ధర్నాకు దిగారు. కోయదొర వేషయంలో చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేస్తూ వారు ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. శివ ప్రసాద్ అంబ పలుకు జగదంబ పలుకు అంటూ అందర్నీ ఆకట్టుకున్నారు.
కాగా, మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశాలు ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి ఉండటంతో మరోసారి రెండుగంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు స్పీకర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అనంతరం స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
మరోవైపు పార్లమెంటులో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నేతలు సభలో రాజీనామాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్ సహా పలువురు రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications