సభలో గందరగోళం: లోకసభ గంట, రాజ్యసభ 15 ని.లు వాయిదా, వెంకయ్య అసహనం
న్యూఢిల్లీ: సభ ప్రారంభమైన నిమిషాల్లోనే మంగళవారం లోకసభ వాయిదా పడింది. పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది. కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభ పన్నెండు గంటల వరకు వాయిదాపడింది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.
మరోవైపు రాజ్యసభలోను ఇదే పరిస్థితి. సభ్యులు ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు, ఏపీకి అన్యాయం జరిగిందంటూ టీడీపీ సభ్యులు కూడా రాజ్యసభలో ఆందోళన నిర్వహించారు. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని, సభకు ఆటంకం కలిగించవద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యుల తీరు సరికాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సభ్యులను పార్టీల నేతలను తన చాంబర్‌కు రావాలని చెప్పి రాజ్యసభ వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications