Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 Phase3 Polling LIVE : మోదీ సొంత రాష్ట్రంలో ఆధిపత్యం ఎవరిది?

లోక్‌సభ ఎన్నికలు 2024 3వ విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారాలు: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. మంగళవారం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 94 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కర్ణాటక, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ దామన్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది.

lok sabha election 2024 phase 3 polling live updates news in telugu for all states parliament election on may 7th

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో గల లోక్‌సభ స్థానాలకూ నేడే పోలింగ్. ఇక్కడ మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. 25 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. సూరత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పోలింగ్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

May 07, 2024, 5:20 pm IST

ఛత్తీస్‌గఢ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 58.19% ఓటింగ్ నమోదైంది. రాయ్‌పూర్, బిలాస్‌పూర్ వంటి అర్బన్ స్థానాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండగా, గిరిజన స్థానాలైన సర్గుజా, రాయ్‌గఢ్‌లలో ఇది ఎక్కువగా నమోదైంది.
May 07, 2024, 5:19 pm IST

భారత కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మే 7న ప్రకటించారు.
May 07, 2024, 4:21 pm IST

మధ్యాహ్నం 3 గంటల సమయానికి, ఉత్తరప్రదేశ్‌లోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం 46.78%గా నమోదైంది.
May 07, 2024, 3:01 pm IST
అస్సాం

కామరూప్‌లో ఓటు వేయడానికి క్యూ లైన్‌లో నిల్చున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబం.
May 07, 2024, 2:52 pm IST
పశ్చిమ బెంగాల్

తమ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదంటూ మాల్దాలో ఎన్నికలను బహిష్కరించిన మహిళలు.
May 07, 2024, 1:30 pm IST
గుజరాత్

రెండు చేతులూ లేనప్పటికీ కాలితో ఓటు వేసిన వ్యక్తి
May 07, 2024, 1:24 pm IST
ఛత్తీస్‌గఢ్

Chhattisgarh
బలరామ్‌పూర్‌లోని సెమ్లీ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన ఒకే కుటుంబానికి చెందిన అయిదు తరాల వ్యక్తులు.
May 07, 2024, 12:43 pm IST
ఛత్తీస్‌గఢ్

పాటన్‌లో ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. రాజ్‌నందగావ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు.
May 07, 2024, 12:34 pm IST
గోవా

కోఠంబిలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
May 07, 2024, 12:22 pm IST
గుజరాత్

భరూచ్‌లో ఓటు వేసిన కాంగ్రెస్ నాయకురాలు ముంతాజ్ పటేల్.
May 07, 2024, 12:20 pm IST
గుజరాత్

జామ్‌నగర్‌లో ఓటు వేసిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్రజడేజా తండ్రి అనిరుద్ధ్ సింహ్ జడేజా, చెల్లెలు నైనా జడేజా.
May 07, 2024, 12:18 pm IST
ఛత్తీస్‌గఢ్

జష్‌పూర్‌లో ఓటు వేసిన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్
May 07, 2024, 12:06 pm IST
ఢిల్లీ

ఉదయం 11 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 32.82, మహారాష్ట్రంలో అత్యల్పంగా 18.18 శాతం పోలింగ్ నమోదు.
May 07, 2024, 11:52 am IST
గుజరాత్

అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అదాని గ్రూప్ కంపెనీల ఛైర్మన్ గౌతమ్ అదానీ.
May 07, 2024, 11:48 am IST
ఢిల్లీ

ఉదయం 11 గంటలకు వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని వెల్లడించిన ఈసీ
May 07, 2024, 11:20 am IST
గోవా

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సౌత్ గోవా బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపో.
May 07, 2024, 11:01 am IST
గుజరాత్

కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
May 07, 2024, 10:43 am IST
ఉత్తర్ ప్రదేశ్

మైన్‌పురి లోక్‌సభ పరిధిలోని సైఫైలో ఓటు వేసిన సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్. ఎస్పీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నారు.
May 07, 2024, 10:33 am IST
కర్నాటక

హవేరిలో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.
May 07, 2024, 10:30 am IST
కర్నాటక

కలబురగి లోక్‌సభ పరిధిలోని గుండుగుర్తిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే.
May 07, 2024, 10:28 am IST
పశ్చిమ బెంగాల్

Mahua Moitra
తన ఓటు హక్కును వినియోగించుకున్న కృష్ణానగర్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మహువా మొయిత్ర
May 07, 2024, 10:18 am IST
కర్నాటక

శివమొగ్గలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ఈశ్వరప్ప. బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.
May 07, 2024, 10:09 am IST

విదిషా లోక్‌సభ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌కు ఓటు వేసేందుకు వచ్చిన మహిళా ఓటర్లు జానపద పాటలు పాడుతున్నారు.
May 07, 2024, 10:06 am IST

ఉత్తర గోవాలో 12.80 శాతం, దక్షిణ గోవాలో 13.24 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం మీద గోవా వ్యాప్తంగా ఉదయం 9 గంటల సమయానికి 13.02 శాతం ఓటింగ్ నమోదైంది.
May 07, 2024, 9:53 am IST

బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఉదయం 9 గంటల వరకు 5.77 శాతం పోలింగ్ నమోదైంది.
May 07, 2024, 9:52 am IST

ఛత్తీస్‌గఢ్‌లో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఉదయం 9 గంటల సమయానికి 13.24 శాతం పోలింగ్ నమోదైంది.
May 07, 2024, 9:42 am IST

అందరు కదిలి వచ్చే ఓటు వేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
May 07, 2024, 9:29 am IST

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ బారామతిలోని మాలెగావ్ గ్రామంలో ఓటు వేశారు.
May 07, 2024, 9:21 am IST

కర్ణాటకలో కేంద్ర మంత్రి ప్రహాల్లద్ జోషి, కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
May 07, 2024, 9:13 am IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+