Lok Sabha: మూడో విడతలో 93 సీట్లకు పోలింగ్, బరిలో అమిత్ షా సహా కీలక నేతలు
న్యూఢిల్లీ: దేశంలో మూడో విడత లోక్‌సభ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం (మే 7) మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మరోవైపు, జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ-అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో ఆరో విడతకు పోలింగ్ తేదీని మార్చారు.
ఈ నేపథ్యంలో మూడో విడతలో 93 లోక్‌సభ పోలింగ్ జరుగుతోంది. గుజరాత్‌లోని 26 స్థానాలు మూడో విడతలో ఉండగా, సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ తిరస్కరణకు గురికావడం, ఇతర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఫలితంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకే మంగళవారం పోలింగ్ జరగనుంది.
కాగా, గుజరాత్‌లో 2014, 2019 ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ బీజేపీనే విజయం సాధించింది. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సోనాల్ పటేల్‌ను బరిలోకి దింపింది. కాగా, ఈ నియోజకవర్గంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఓటరుగా ఉన్నారు. దీంతో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోర్‌బందర్ నుంచి కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాజ్‌కోట్‌లో మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పోటీ చేస్తున్నారు.

మరోవైపు, కర్ణాటకలో మిగిలిన 14 లోక్‌సభ స్థానాలకు మంగళవారమే మూడో విడతలో పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో మొత్తం 28 సీట్లు ఉండగా 14 చోట్ల రెండో విడతలో ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 సీట్లలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. 14 స్థానాల్లో 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. కాగా, ఈ 14 స్థానాలను 2019లో బీజేపీనే దక్కించుకుంది.
కర్ణాటకలోని ధార్వాడ నుంచి ఇప్పటికే 3 సార్లు గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూటీతో తలపడుతున్నారు. మరో కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా బీదర్ నుంచి మరోసారి పోటీకి నిలిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై హవేరీ స్థానంలో, జగదీష్ షెట్టార్ బెల్గాంలో పోటీలో ఉన్నారు.
ఇక, మహారాష్ట్రలో కీలకమైన 11స్థానాలకు మూడో దశలో మంగళవారం పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ సీట్ల ఉండగా తొలి విడతలో 5, రెండో విడతలో 8 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో పోలింగ్ జరిగే 11 స్థానాలకు 258 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.09 కోట్ల మంది ఓటర్లు ఉండగా 23 వేల 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటలాంటి బారామతిలో ఆయన కుమార్తె సుప్రియా సూలేపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పోటీకి దిగడం వల్ల పోరు ఆసక్తికరంగా మారింది. రత్నగిరి-సింధ్‌దుర్గ్ స్థానంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణె బరిలో ఉన్నారు.
ఇది ఇలావుంటే, ఉత్తర్ ప్రదేశ్‌లోని పది స్థానాలకు మంగళవారం మూడో విడతలోనే పోలింగ్ జరగనుంది. యూపీలోని పది స్థానాలకు 100 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1.88 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఈ విడతలో సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు పోటీలో ఉంది. మెయిన్‌పురి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. డింపుల్‌పై ఈసారి బీజేపీ యూపీ పర్యటక మంత్రి జయవీర్ సింగ్‌ను నిలిపింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోలోని తొమ్మిది స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాలు ఉండగా తొలి రెండు దశల్లో 11 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో 9 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 127 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్‌గడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచారు. దాదాపు, 30 ఏళ్ల తర్వాత దిగ్విజయ్ సింగ్ లోక్‌సభ పోటీలో ఉండటం గమనార్హం. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు నియోజకవర్గాలకు కూడా మూడో విడతలోనే మంగళవారం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాట తెలుగు ఓటర్లు ఎవరి వైపు, విజయ్ Vs పవన్ - సీన్ ఛేంజ్: గ్రౌండ్ రిపోర్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications