ఆరో విడత లోక్‌సభ పోలింగ్: రాజధానిలో పాగా వేసేదెవరు?
Lok Sabha elections 2024 Phase 6: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన అంటే శనివారం ఆరో విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.
ఆరో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్‌సభ స్థానాలకు 26వ తేదీన పోలింగ్ జరుగనుంది. బిహార్- 8, ఢిల్లీ- 7, హర్యానా-10, బిహార్- 5, జమ్మూ కాశ్మీర్- 1, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 14, పశ్చిమ బెంగాల్- 8, జార్ఖండ్-4 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం సాయంత్రానికి స్తబ్దత నెలకొంది. ఇక పోలింగ్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.
ఈ దశ ఎన్నికల్లో పలువురు కీలక అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. కేంద్ర మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్.. ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సోమ్‌నాథ్ భారతిపై ఆమె పోటీ చేశారు.
ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి కన్నయ్య కుమార్.. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై బీజేపీ సీనియర్ నేత మనోజ్ తివారీ రంగంలో దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ పోటీలో నిలిచారు.
మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అనంత్ నాగ్ - రాజౌరి నుంచి, హర్యానాలోని కర్నాల్ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. గుర్‌గావ్ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న వారి జాబితాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications