కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలో చేరిన సీనియర్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. లూధియానా కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనుమడు రవ్‌నీత్ సింగ్ బిట్టు (Ravneet Singh Bittu) బీజేపీలో చేరారు. మూడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచిన బిట్టు ప్రస్తుతం లూదియానా నుంచి లోక్‌సభ (Lok sabha)కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తమ పార్టీలో చేరేందుకు వచ్చిన బిట్టూకు బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు.
కాషాయ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిట్టు మాట్లాడుతూ.. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా ఎన్నుకునేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.

పంజాబ్ పట్ల ప్రేమ చూపడంతోపాటు ఎంతో చేయాలని చూస్తున్న వారిలో ఈ నేతలిద్దరూ (మోడీ, షా)లు ఉన్నారని బిట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులు, కార్మికులు, పరిశ్రమలకు మధ్య వారధిలా ఉండేలా కృషి చేస్తామన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదం ఉన్న చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్న ఎంపీ బిట్టూ.. శాంతి స్థాపనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్రను కొనియాడారు. పంజాబ్ అభివృద్ధి గురించిన అంశాలను ప్రస్తావించిన ప్రతిసారీ ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్ డే మాట్లాడుతూ.. బిట్టూ చేరికతో తమ పార్టీ బలపడుతుందన్నారు.
#WATCH | Ravneet Singh Bittu meets BJP national president JP Nadda at his residence, in Delhi.
— ANI (@ANI) March 26, 2024
The Congress Lok Sabha MP joined the BJP earlier this evening. pic.twitter.com/13mjU1Cw4z
కాగా, జనవరిలో ఏర్పాటు చేసిన 27 మంది సభ్యుల పంజాబ్ యూనిట్ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో రవ్‌నీత్ సింగ్ బిట్టు ఉన్నారు. పంజాబ్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత బిట్టూ చేరిక జరగడం గమనార్హం. బీజేపీలో చేరిన అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశారు రవ్‌నీత్ సింగ్ బిట్టు. కాగా, పంజా్ రాష్ట్రంలో మరికొందరు కూడా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని పార్టీ నేతలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications