మూటెలు మోసిన అపర కుబేరుడు నవీన్ జిందాల్
Naveen Jindal: ఇంకో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల పర్వం మొదలు కాబోతోంది. ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ 19వ తేదీన షెడ్యూల్ అయింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో.. ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.

హర్యానాలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఆరో విడతలో అంటే మే 25వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేయడానికి అటు ఎన్డీఏ, ఇటు ఇండియా పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకున్నాయి.
కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు అపర కుబేరుడు నవీన్ జిందాల్. జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ ఆయన. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్‌లో కొనసాగారాయన. 2004, 2009 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.
कुरुक्षेत्र लोकसभा से भाजपा उम्मीदवार नवीन जिंदल ने कंधे पर गेहूं की बोरी रखकर ट्रक में लोड की... @MPNaveenJindal pic.twitter.com/bYHFsFmLl8
— Journalist Rajeev Rathi (@RajivRathi999) April 17, 2024
ఇప్పుడు పార్టీ ఫిరాయించారు. కొద్దిరోజుల కిందటే కాషాయ కండువాను కప్పుకొన్నారు. అదే కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్ మీద రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ జిందాల్.. స్థానిక మార్కెట్ యార్డులో మూటెలు మోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 50 కేజీల గోధుమ మూటెను ఎత్తుకుని లారీలోకి లోడ్ చేశారు.












Click it and Unblock the Notifications