Mohammed Faizal: లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ పై అనర్హత ఎత్తివేత..
లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ పై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత ఎత్తివేసింది. మహ్మద్ ఫైజల్ 2009లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్ పై దాడి చేశారని కేసు నమోదు అయింది. ఈ కేసులో జనవరి10న లక్షద్వీప్ ఫజల్ ను కవరత్తీ సెషన్స్ కోర్టు దేషిగా తేల్చడంతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అతనపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. కరవత్తీ కోర్టు తీర్పుపై మహ్మద్ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేంది.
కేరళ హైకోర్టు స్టే విధించిన తర్వాత కూడా లోక్ సభ సెక్రటేరియట్ అనర్హతను ఎత్తివేయాలేదు. దీంతో ఫైజల్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ ను మార్చి 28న మంగళవారం సుప్రీం కోర్టు విచారణ పిటిషన్ల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ సెక్రటేరియట్ అతనిపై అనర్హత వేటు వేసింది. మహ్మద్ ఫైజల్ 2019లో లోక్ సభకు ఎన్నికయ్యారు.

జనవరి 13న, లోక్‌సభ సెక్రటేరియట్ ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం ఫైజల్‌పై అనర్హత వేటు వేసింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తికి రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే ఆ వ్యక్తిపై తక్షణమే అనర్హత వేటు వేయ్యొచ్చు. పరువు నష్టం కేసులో సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.
జనవరి 18న, సెషన్స్ కోర్టు ఉత్తర్వుపై ఫైజల్ చేసిన అప్పీల్ కేరళ హైకోర్టులో విచారణలో ఉండగా.. లక్షద్వీప్ స్థానానికి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. జనవరి 25న షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు, కేరళ హైకోర్టు ఫైజల్‌కు విధించిన నేరాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత లక్షద్వీప్‌లో ఉపఎన్నికను "నిలిపివేయాలని" నిర్ణయించినట్లు EC ప్రకటించింది.












Click it and Unblock the Notifications