డీసీఎంకు మైండ్ బ్లాక్, సీబీఐ పోయింది, లోకాయుక్త వచ్చింది, అక్రమాస్తుల కేసులో నోటీసులు !

లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్‌కు భారీ షాక్‌ తగిలింది. డీకే శివకుమార్‌కు లోకాయుక్త మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న డీకే శివకుమార్ కు ఇపుడు మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే డీకే శివకుమార్ అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఆ పత్రాలు ఇవ్వాల్సిందిగా లోకాయుక్త అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అక్రమ ఆస్తులు సంపాదించారని నమోదు అయిన కేసులో సీబీఐ విచారణను రద్దు చేసిన సిద్దరామయ్య ప్రభుత్వం ఆ కేసును కర్ణాటక లోకాయుక్తకు అప్పగించింది. గత ఫిబ్రవరి నెలలో డీకే శివకుమార్‌పై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి ఆస్తి ఆదాయం వివరాలు ఇవ్వాలని లోకాయుక్త అధికారులు డీకే శివకుమార్ కు నోటీసు జారీ చేశారు.

Lokayukta issued notice to Karnataka DCM DK Shivakumar in case of illegal assets

నోటీసులో సీబీఐకి ఇచ్చిన పత్రాల సమాచారాన్ని తమకు ఇవ్వాలని లోకాయుక్త అధికారులు డీసీఎం డీకే శివకుమార్ ను ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ 2013 నుంచి ఏప్రిల్ 30వ తేదీ 2018 మధ్య కాలంలో రూ.74. 93 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే విషయంలో లోకాయుక్తకు ఇప్పటికే ఫిర్యాదు చేయగా, ఇప్పుడు దానికి సంబంధించిన పత్రాలు అందించాలని లోకాయుక్త డీకే శివకుమార్ కు నోటీసు జారీ చేసింది.

అక్రమ ఆస్తుల సంపాదించారని 2020 అక్టోబరు 3వతేదీన సీబీఐ అధికారులు డీకే శివకుమార్‌పై అవినీతి నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసింది. అయితే గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఇచ్చిన అనుమతిని తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తరువాత కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం 2023 నవంబర్ 23వ తేదీన ఈ కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసులకు అప్పగించింది.

అనంతరం కర్ణాటక ప్రభుత్వ ఆదేశాల మేరకు లోకాయుక్త అధికారులు డీసీఎం డీకే శివకుమార్‌పై కేసు నమోదు చేసి ఆ కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. డీసీఎం డీకే శివకుమార్ లోక్‌సభ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే లోకాయుక్త నోటీసు ఇవ్వడంతో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. లోకాయుక్త ఇచ్చిన నోటీసులకు డీకే శివకుమార్ ఎలాంటి సమాచారం ఇస్తారో అని కన్నడిగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+