లోక్ పోల్ సర్వేతో అధికార పార్టీకి షాక్, మోదీ ఉన్న టైమ్ లో ? షాక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన, ఎన్నికల కౌటింగ్ మే 13వ తేదీన జరగనుంది. ఇప్పటికే పలు సంస్థలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు విడుదల చేశాయి. ఇప్పుడు లోక్ పోల్ (LokPoll) సర్వే ఫలితాలు విడుదల చెయ్యడంతో బీజేపీ నాయకులు షాక్ అయ్యారు.
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో రోడ్ షో నిర్వహించారు. ఆదివారం ఉదయం కూడా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో లోక్ పోల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు విడుదల చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో 113 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మెజారిటీ ఉన్న పార్టీ మాత్రమే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది.

లోక్ పోల్ సర్వే ప్రకారం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి 59 నుంచి 65 స్థానాలు మాత్రమే వస్తాయని వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీకి 129 నుంచి 134 స్థానాలు వస్తాయని సర్వే తెలిపింది. చాలా సంవత్సరాల నుంచి కర్ణాటకలో కింగ్ మేకర్ గా అవతరిస్తున్న జేడీఎస్ పార్టీకి 23 నుంచి 28 స్థానాలు వస్తాయని, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారని LokPoll సర్వే తెలిపింది.
లోక్ పాల్ సర్వే ప్రకారం కర్ణాటకలో బీజేపీకి 31 శాతం నుంచి 32 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 42 శాతం నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని, జేడీఎస్ పార్టీకి 14 శాతం నుంచి 18 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇతరులకు 5 శాతం నుంచి 8 శాతం ఓట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే తెలిపింది. అయితే లోక్ పోల్ సర్వే పనికిమాలిన సర్వే అంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
Final numbers of Lok poll for #KarnatakaElection2023 pic.twitter.com/XHps5z9zoJ
— Lok Poll (@LokPoll) May 6, 2023
ఇంత వరకు బీజేపీ ఇన్ని తక్కువ సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా చెప్పలేదు. ప్రతి సర్వేలో ఇంచుమించు కాంగ్రెస్, బీజేపీల మధ్య 10 నుంచి 18 సీట్ల మధ్య తేడా ఉంది. అయితే లోక్ పోల్ సర్వేలో బీజేపీకి 65 స్థానాలకంటే ఎక్కువ సీట్లు రావని వెలుగు చూడటంతో బీజేపీ నాయకులు లోక్ పోల్ సర్వే మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications