Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్‌సభ ఎన్నికలు 2019 : ఆరోవిడత పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్ డేట్స్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6 విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హర్యానాలోని అన్ని స్థానాలకు 6వ విడతలోనే పోలింగ్ జరగనుంది. బీహార్‌లో 8 స్థానాలు, ఢిల్లీ ఎన్సీటీలో 7 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు, జార్ఖండ్‌లో 4 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 8స్థానాలు, ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Loksabha elections 2019: Sixth Phase live updates

ఆరవ విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. మేనకా గాంధీ, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, అతిషి, గౌతం గంభీర్, సాద్వీ ప్రగ్యా, దిగ్విజయ్ సింగ్‌లు పోటీలో ఉన్నారు. మొత్తం బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 979 ఉండగా ఒక్క హర్యానాలోనే 223 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 75 లక్షలు ఉండగా .. థర్డ్ జెండర్ ఓటర్లు దాదాపు 3281 మంది ఉన్నారు.

Loksabha elections 2019: Sixth Phase live updates

ఇక 6వ విడత పోలింగ్ పూర్తికాగానే ఇక ఒకే విడత పోలింగ్ ఉంటుంది. అది మే 19న జరుగుతుంది. అన్ని విడతల పోలింగ్‌కు సంబంధించిన ఫలితాలు మే 23న తెలుస్తాయి.

May 12, 2019, 7:20 pm IST

న్యూఢిల్లీ

ఆరో విడత రాత్రి 7 గంటల వరకు 61.14 శాతం పోలింగ్ నమోదు
May 12, 2019, 5:50 pm IST

సాయంత్రం 5 గంటల సమయానికి నమోదైన పోలింగ్

బీహార్: 44.67శాతం, ఢిల్లీ ఎన్సీటీ: 45.36శాతం; హర్యానా : 54.41శాతం; మధ్యప్రదేశ్: 54.08 శాతం; ఉత్తర్ ప్రదేశ్: 43.26శాతం; పశ్చిమ బెంగాల్ :70.77 శాతం; జార్ఖండ్ : 58.32శాతం
May 12, 2019, 4:51 pm IST

ఢిల్లీ

నిర్మాణ్ భవన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు
May 12, 2019, 4:42 pm IST

మధ్యాహ్నం 4 గంటల సమయానికి నమోదైన పోలింగ్

బీహార్:44.40శాతం, ఢిల్లీ ఎన్సీటీ: 45.22శాతం; హర్యానా : 51.80శాతం; మధ్యప్రదేశ్:52.62 శాతం; ఉత్తర్ ప్రదేశ్: 43.26శాతం; పశ్చిమ బెంగాల్ :70.51 శాతం; జార్ఖండ్ :58.08శాతం
May 12, 2019, 4:04 pm IST

ఢిల్లీ

నిర్మాణ్ భవన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ దనోవా
May 12, 2019, 4:03 pm IST

హర్యానా

మధ్యాహ్నం 3 గంటలకు హర్యానాలో 51.48 శాతం పోలింగ్ నమోదు
May 12, 2019, 2:58 pm IST

ఢిల్లీ

ఢిల్లీలోని కె.కామరాజ్ లేన్లోని ఎన్‌పీ స్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
May 12, 2019, 2:57 pm IST

మధ్యాహ్నం 2 గంటల సమయానికి నమోదైన పోలింగ్

బీహార్: 35.22శాతం, ఢిల్లీ ఎన్సీటీ: 33.63శాతం; హర్యానా : 39.16శాతం; మధ్యప్రదేశ్: 42.25 శాతం; ఉత్తర్ ప్రదేశ్: 34.30శాతం; పశ్చిమ బెంగాల్ :55.77 శాతం; జార్ఖండ్ : 47.16శాతం
May 12, 2019, 2:07 pm IST

ఢిల్లీ

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న నీతి ఆయోగో సీఈఓ అమితాబ్ కాంత్, ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా
May 12, 2019, 1:02 pm IST

12:40 గంటలకు నమోదైన పోలింగ్

బీహార్: 20.70శాతం, ఢిల్లీ ఎన్సీటీ: 19.55శాతం; హర్యానా : 23.53శాతం; మధ్యప్రదేశ్: 28.54 శాతం; ఉత్తర్ ప్రదేశ్: 21.75శాతం; పశ్చిమ బెంగాల్ : 38.26 శాతం; జార్ఖండ్ : 31.27శాతం
May 12, 2019, 1:00 pm IST

12 గంటల 40 నిమిషాలకు నమోదైన పోలింగ్ శాతం

12:40 నిమిషాలకు 25.15% పోలింగ్ నమోదు
May 12, 2019, 12:48 pm IST

ఢిల్లీ

ఈ సారి ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రజాస్వామ్యంను కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు: ప్రియాంకా గాంధీ
May 12, 2019, 12:46 pm IST

ఢిల్లీ

లోధీ రోడ్‌లోని సర్దార్ పటేల్ విద్యాలయలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రియాంకా గాంధీ , రాబర్ట్ వాద్రా
May 12, 2019, 12:44 pm IST

ఢిల్లీ

సంచార్ భవన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కమ్యూనిస్టు నేత ప్రకాష్ కారత్
May 12, 2019, 11:43 am IST

పోలింగ్ శాతం నమోదు

ఉదయం 11 గంటల 20 నిమిషాలకు దేశవ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 21.80శాతం
May 12, 2019, 11:40 am IST

పశ్చిమ బెంగాల్

బంకురా నియోజకవర్గంలోని పోలింగ్ నెంబర్ 254లో బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ. టీఎంసీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపణ
May 12, 2019, 11:30 am IST

ఢిల్లీ

ఢిల్లీలోని డీపీఎస్ మథురా రోడ్డులో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్
May 12, 2019, 11:27 am IST

ఢిల్లీ

నిర్మాణ్ భవన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియాగాంధీ
May 12, 2019, 11:15 am IST

ఢిల్లీ

ఢిల్లీలో ఓటు వేసిన రాహుల్ గాంధీ..ఈ ఎన్నికలు పెద్దనోట్ల రద్దు, రైతు సమస్యలు, రాఫెల్ కుంభకోణం, గబ్బర్ సింగ్ ట్యాక్స్‌లాంటి ప్రధాన అంశాలపై జరుగుతున్నాయి. మోడీ విద్వేషం పంచారు మేము ప్రేమను పంచాము: రాహుల్ గాంధీ
May 12, 2019, 11:12 am IST

పశ్చిమ బెంగాల్

గటల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్ కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి..ఇది టీఎంసీ కార్యకర్తల పనే అంటున్న బీజేపీ
May 12, 2019, 11:11 am IST

ఢిల్లీ

సివిల్ లైన్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
May 12, 2019, 11:10 am IST

ఢిల్లీ

ఔరంగజేబు లేన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
May 12, 2019, 11:09 am IST

ఢిల్లీ

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న 111 ఏళ్ల బచన్ సింగ్
May 12, 2019, 10:10 am IST

మధ్యప్రదేశ్

మానవత్వం ఉన్న మనిషి ఎవరూ భోపాల్‌లో బీజేపీ అభ్యర్థి ప్రగ్యా సాధ్వీకి ఓటు వేయరు: భోపాల్ యువత
May 12, 2019, 10:06 am IST

ఢిల్లీ

ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ ఈశాన్య ఢిల్లీ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి
May 12, 2019, 9:37 am IST

ఉ.9గం. వరకు నమోదైన పోలింగ్ శాతాలు

బీహార్ 9.03, హర్యానా 3.74, మధ్యప్రదేశ్ 4.01, ఉత్తర్ ప్రదేశ్ 6.86, బెంగాల్ 6.58, జార్ఖండ్ 12.45, ఢిల్లీ 3.74శాతం
May 12, 2019, 9:22 am IST

హర్యానా

కర్నల్‌లో ఓటు వేసిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
May 12, 2019, 9:21 am IST

ఢిల్లీ

పాండవ్ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
May 12, 2019, 9:20 am IST

ఢిల్లీ

రాష్ట్రపతి భవన్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
May 12, 2019, 9:05 am IST

ఢిల్లీ

నిజాముద్దీన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+