యువతిపై మహిళా యాసిడ్ దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా?

Love affair may be the reason for acid attack
విశాఖపట్నం: ఒక యువతిపై మరో మహిళ యాసిడ్ పోసిన సంఘటన బుధవారం విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించింది. తన ప్రియుడు ఆ యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడటమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన స్వప్నకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అయితే గత కొద్ది నెలలుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోంది.

మీడియా కథనాల ప్రకారం - ఈ స్థితిలో ఆమెకు సత్యనారాయణ రెడ్డి అనే యువకునితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసిందని వార్తలు వచ్చాయి. కాగా, ఇటీవల సత్యనారాయణ రెడ్డికి అక్కయ్యపాలెంలో ఒక యువతితో వివాహం కుదిరింది. ఇది తెలిసిన స్వప్న బుధవారం ఆ యువతి నడుపుతున్న ఫ్యాన్సీ స్టోర్ వద్దకు వెళ్లి తనను పరిచయం చేసుకుంది. సత్యనారాయణరెడ్డితో తనకు గల సంబంధాన్ని వివరించి, అతడిని ఏ విధంగా వివాహం చేసుకుంటావని ఘర్షణకు దిగింది.

అంతేగాకుండా స్వప్న తన వెంట తెచ్చుకున్న బాత్రూమ్ యాసిడ్‌ను రజనీ ముఖంపై చల్లింది. దీంతో గాయపడ్డ యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. నిందితురాలు స్వప్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు బీభత్సం

విశాఖపట్నం జిల్లా రావికమతంలో బుధవారం ఉదయం ఓ కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకువెళ్లడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. ఈ ప్రమాదం నుంచి స్థానిక ఎస్‌ఐ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి.

రావికమతం మండల మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు గంటా ఈశ్వరరావు భార్య సత్యవేణితో కలిసి ఉదయం 9.30 గంటలకు తన సొంత కారులో విశాఖపట్నం బయలుదేరారు. ఇంటి నుంచి వంద మీటర్ల దూరం కూడా వెళ్లకముందే వీరి వాహనం తోపుడుబండిని ఢీకొంది. అనంతరం అదుపుతప్పి మితిమీరిన వేగంతో ప్రధాన రహదారిలో జనాలపైకి దూసుకుపోయింది.

దీంతో మండలంలోని గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన డొంకిన పోతురాజు (39) అక్కడికక్కడే మృతిచెందాడు. పిల్లవానిపాలెం గ్రామానికి చెందిన పుప్పాల అప్పలకొండ (55) తీవ్రంగా గాయపడి అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రిలో మృతిచెందాడు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దొండపూడి గ్రామానికి చెందిన మజ్జి అప్పారావు, గుమ్మళ్లపాడుకు చెందిన గొర్లె రాజిబాబు, నర్సీపట్నంకు చెందిన కిన్నెర నాగరాజు (కేబుల్‌ ఆపరేటర్‌)ల పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+