ఢిల్లీ గెస్ట్ హౌస్ లో లవర్స్ ఆత్మహత్య, ఆన్ లైన్ లో రూం బుక్ చేశారు, ఒక్క రోజు ! (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన యువజంట (లవర్స్) గెస్ట్ హౌస్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే యువతి, యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ లో నివాసం ఉంటున్న 20 ఏళ్ల యువకుడు, ఢిల్లీలోని రోహిణి ఏరియాలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ గురువారం కలుసుకున్నారు. తరువాత ఆన్ లైన్ లో ద్వారకా సెక్టార్ 17లోని ఓ గెస్ట్ హౌస్ లో రూం బుక్ చేసుకున్నారు.

గురువారం ఇద్దరూ గెస్ట్ హౌస్ లోని గదిలోకి వెళ్లారు. తరువాత గది నుంచి బయటకు రాలేదు. శుక్రవారం గది ఖాళీ చెయ్యాల్సి ఉంది. రూం బాయ్ వెళ్లి తలుపుకొట్టారు. ఎంతసేపటికి గదిలో ఉన్న యువతి, యువకుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వచ్చి నకిలి తాళంతో గది తలుపులు తెరచి చూడగా ఇద్దరూ ఒకే ఫ్యాన్ కు వేరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రీతిలో కనపడ్డారు. ఇద్దరి మొబైల్ లోని ఫోన్ నెంబర్ల ఆధారం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే యువతి, యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young couple from the national capital allegedly committed suicide under mysteriously circumstances in a local guest house in New Delhi, police said.
Please Wait while comments are loading...