ఐసీయూలో ఒక్కటైన జంట.. కారణం తెలిస్తే షాక్..!

ఆ యువ జంట పెళ్లి నిశ్చయమైంది. మరికొన్ని గంటల్లో వాళ్ల వివాహం కళ్యాణమండపంలో ఘనంగా జరగాల్సి ఉంది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఇంతలోనే వధువుకు ప్రమాదం జరిగింది. మేకప్ కోసం వెళ్లిన వధువు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైంది. వధువు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే మరోవైపు వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. దీంతో ముహూర్తం సమయం మిస్ కావొద్దన్న ఉద్దేశంతో ఐసీయూలోనే వధువుకు తాళి కట్టాడు వరుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


కేరళలోని కొచ్చిలో షాకింగ్ ఘటన జరిగింది. మరికొద్ది గంటల్లో వివాహం చేసుకోవాల్సిన సమయంలో మేకప్ కోసం వెళ్లిన వధువు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ముహూర్తం మిస్ కావొద్దన్న కారణంతో ఐసీయూలోనే వధువుకు తాళి కట్టాడు వరుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొచ్చి సమీపంలోని అలప్పుజా కు చెందిన అవని అనే యవతికి.. తుంబోలీ ప్రాంతానికి చెందిన వీఎం షారన్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, పెద్దలు ఎంతో సంతోషంగా కల్యాణ మండపంలో వివాహం చేయాలని భావించారు.

Love Defies Death Groom Ties Sacred Thali to Bride in Kochi ICU Heart-Wrenching Viral Story

అయితే మేకప్ కోసం వధువు అవనిని మరో గ్రామానికి తీసుకెళ్తుండగా వారి కారు అదుపుతప్పి ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అవనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజీలో చేర్పించారు. అవనికి యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వివాహ మండపం నుంచే ఆస్పత్రికి పరుగున వెళ్లారు. అవని ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ముహూర్తం ప్రకారమే పెళ్లి చేసుకోవాలని వధూవరులతోపాటుగా పెద్దలు కూడా నిశ్చయించారు. దీంతో అదే ముహూర్తానికి ఐసీయూలోనే అవనికి తాళి కట్టాడు షారన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వధూవరులిద్దరూ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+