ప్రేమ, పెళ్లి అంటూ తల్లిని చేశాడు: నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ ప్రియుడు మాయం !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ప్రేమ పెళ్లి పేరుతో యవతిని తల్లిని చేసిన ప్రియుడు చివరికి నిన్ను పెళ్లి చేసుకోను నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ పరారైన ఘటన కర్ణాటకలోని మైసూరు దక్షిణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియురాలిని మోసం చేసిన నవీన్ అనే యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హెచ్ డీ కోటే తాలుకాలోని కల్లంబాలు గ్రామానికి చెందిన నవీన్ మైసూరు తాలుకా వరుణ సమీపంలోని గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గర అయ్యాడు. యువతి గర్బవతి అయ్యింది.

Love dramaphysical contact with a young woman in Mysuru

తాను గర్బవతి అయ్యానని, వెంటనే పెళ్లి చేసుకోవాలని యువతి నవీన్ కు చెప్పింది. ఎవరితోనో నీవు గర్బవతి అయ్యావని, నిన్ను నేను పెళ్లి చేసుకోనని నవీన్ ఎదురు తిరిగాడు. యువతి పెళ్లి చేసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ నవీన్ అన్నాడు. వారం రోజుల నుంచి నవీన్ మాయం కావడంతో మంగళవారం బాధితురాలు మైసూరు దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ కోసం గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
love dramaphysical contact with a young woman in Mysuru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి