Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: లవ్ మ్యారేజ్, తాళి తెంపేసి ప్రియుడి ముఖం మీద కొట్టారు, అమ్మాయిని లాక్కెళ్లి, ప్రియుడు !

చెన్నై/మదురై: యువతి, యువకుడు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రేమికులు పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని ఆశపడ్డారు. పెద్దలకు భయపడిన ప్రేమికులు ఇంతకాలం సీక్రేట్ గా కలుసుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తరువాత ప్రేమికులు వాళ్ల ఇళ్లల్లో పెళ్లి చేసుంటామని, మీరు మా పెళ్లికి అంగీకరించాలని చెప్పారు. పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కొంతకాలం అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపించకుండా చేశారు. ఇటీవల ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రియురాలు ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్న దంపతులు కొత్తగా కాపురం పెట్టారు. మిస్సింగ్ కేసు పెట్టిన అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులు మీద ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమికులను పట్టుకున్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించిన అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కూతురి మెడలో ఉన్న తాళిని తెంపేసి ఆ తాళి ప్రియుడి ముఖం మీద కొట్టి అమ్మాయిని ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయారు. కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యను దూరం చేశారని ఆవేదనతో రగిలిపోయిన ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ఒకే ప్రాంతంలో అమ్మాయి, అబ్బాయి

ఒకే ప్రాంతంలో అమ్మాయి, అబ్బాయి

తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని వేలంగానిలో అరవింద్ కుమార్ అలియాస్ అరవింద్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో శివ నందిని అలియాస్ నందిని అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి అరవింద్, నందినికి పరిచయం ఉంది. ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకున్నారు.

 సంతోషంగా తిరిగిన ప్రేమికులు

సంతోషంగా తిరిగిన ప్రేమికులు

ఇంతకాలం స్నేహితులుగా ఉన్న అరవింద్, నందిని గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రేమికులు అరవింద్, నందిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని ఆశపడ్డారు. పెద్దలకు భయపడిన ప్రేమికులు అరవింద్, నందిని ఇంతకాలం సీక్రేట్ గా కలుసుకుంటున్నారు.

 సేమ్ డైలాగ్ చెప్పిన అమ్మాయి ఫ్యామిలీ

సేమ్ డైలాగ్ చెప్పిన అమ్మాయి ఫ్యామిలీ

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తరువాత ప్రేమికులు అరవింద్, నందిని వాళ్ల ఇళ్లల్లో పెళ్లి చేసుంటామని, మీరు మా పెళ్లికి అంగీకరించాలని చెప్పారు. పెళ్లికి అమ్మాయి నందిని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కొంతకాలం నందినిని ఇంటి నుంచి బయటకు పంపించకుండా చేసి ఆమె ప్రియుడు అరవింద్ తో మాట్లాడకుండా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొన్నారు.

 లేచిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికులు

లేచిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికులు

ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రియురాలు నందిని ఆమె ప్రియుడు అరవింద్ తో కలిసి పారిపోయింది. స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్న అరవింద్, నందిని దంపతులు కొత్తగా కాపురం పెట్టారు. జనవరి 11వ తేదీన నందిని కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యలుు వెలంగాని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. నందిని కుటుంబ సభ్యులు పోలీసులు మీద ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమికులు అరవింద్, నందినిని పట్టుకున్నారు.

 పోలీస్ స్టేషన్ లో తాళి తెంపేసి ప్రియుడి ముఖం మీద కొట్టారు

పోలీస్ స్టేషన్ లో తాళి తెంపేసి ప్రియుడి ముఖం మీద కొట్టారు

రాజకీయ పలుకుబడి ఉపయోగించిన నందిని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లోనే కూతురిని, అరవింద్ కు కిందపడేసి చితకబాదేశారు. చివరికి నందిని మెడలో ఉన్న తాళిని తెంపేసి ఆ తాళి ప్రియుడు అరవింద్ ముఖం మీద కొట్టి ఆ అమ్మాయిని ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయారు.

 ఆవేదనతో ప్రియుడి ఆత్మహత్య

ఆవేదనతో ప్రియుడి ఆత్మహత్య

ఇంకోసారి నందిని జోలికి వెలితే చంపేస్తామని పోలీసులు అరవింద్ కు వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య నందినిని దూరం చేశారని ఇన్ని రోజులు ఆవేదనతో రగిలిపోయిన ప్రియుడు అరవింద్ అతని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మా అబ్బాయి అరవింద్ ఆత్మహత్యకు నందిని కుటుంబ సభ్యులు కారణం అని అతని కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+