Wife: నాలుగు నెలల క్రితం లవ్ మ్యారేజ్, హెల్మెట్ వేసుకుని వెళ్లి భార్యను నడిరోడ్డులో చంపేసిన భర్త !
ప్రేమ గుడ్డిది అని సామెతను ప్రియురాలు నిజం చేసింది. ఇంటి నుంచి పారిపోయిన ప్రియురాలు ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తరువాత అసలు కథమొదలైయ్యింది.
చెన్నై/మధురై: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికుల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ప్రేమికుల వయసులో 9 ఏళ్లు తేడా ఉంది. ప్రియుడు ఏం పనిపాటా చెయ్యడం లేదని, నిన్ను ఎలా పోషిస్తాడని అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ప్రేమ గుడ్డిది అని సామెతను ప్రియురాలు నిజం చేసింది. ఇంటి నుంచి పారిపోయిన ప్రియురాలు ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న ప్రేమికులు అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. తరువాత అసలు కథ మొదలైయ్యింది. హెల్మెట్ వేసుకుని వెళ్లిన భర్త లవ్ మ్యారేజ్ చేసుకున్న అతని భార్యను నడిరోడ్డులోనే కత్తితో పొడిచి చంపేయడం కలకలం రేపింది.

ఒకే సిటీలో లవర్స్
తమిళనాడులోని మధురై సిటీలోని మధురై సౌత్ అవుట్‌స్కర్ట్స్ ప్రాంతంలో మీనాక్షి, సుందరం దంపతులు నివాసం ఉంటున్నారు. మీనాక్షి, సుందరం దంపతులకు వర్షా (19) అనే కుమార్తె ఉంది. మధురైని కీరైతుర ప్రాంతంలో పళని (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వర్షా మైనర్ గా ఉన్న సమయంలోనే ఆమె మీద పళని కన్ను వేశాడు, ఇద్దరి మధ్య వయసులో 9 సంవత్సరాలు తేడా ఉంది.

పెళ్లికి నో చెప్పిన పెద్దలు
రెండు సంవత్సరాల క్రితం వర్షా కూడా పళనిని ప్రేమించడం మొదలుపెట్టింది. ప్రియుడు పళని గాలికి తిరుగుతున్నాడు. పళని ప్రేమ విషయం తెలియగానే వర్షా ఇంట్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. నీ ప్రియుడు పళని ఏం పనిపాటా చెయ్యడం లేదని, వాడు గాలికి తిరుగుతున్నాడని, నిన్ను ఎలా పోషిస్తాడని, పిల్లలు పుట్టిన తరువాత మీ పరిస్థితి ఏమిటని వర్షాను ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ప్రియురాలు వర్షాను పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదని పళనికి అతని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

ప్రియురాలు జంప్ జిలాని
ప్రేమ గుడ్డిది అని సామెతను ప్రియురాలు వర్షా నిజం చేసింది. ఇంటి నుంచి పారిపోయిన ప్రియురాలు వర్షా ఆమె ప్రియుడు పళనిని గత ఏడాది సెప్టెంబర్ నెలలో కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకుంది. ప్రేమికులు పళని, వర్షాల వివాహం జరిగి ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు. ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు వర్షా కొన్ని బంగారు నగలు ఎత్తుకుని ప్రియుడు పళని దగ్గరకు వెళ్లిపోయింది.

పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేశాడు.... భార్యను మాత్రం ?
పెళ్లి చేసుకున్న తరువాత పళని, వర్షా దంపతులు మధురైలోని జైహింద్‌పురంలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల్లో ప్రేమ పెళ్లి పెటాకులు అయ్యింది. కుటుంబ సభ్యులను వదిలేసి వచ్చి పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లికూతురు వర్షాకు కనీసం తిండికూడా పెట్టలేని పరిస్థితికి పళని వచ్చేశాడు. ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని రోజు రాత్రి పూటా మద్యం సేవించి ఇంటికి వెళ్లడం మొదలు పెట్టాడు. పెళ్లిజరిగిన నాలుగు నెలలకే భార్య వర్షాకు పళని సినిమా చూపించాడు.

బతకలేక వెళ్లిపోయిన కొత్త పెళ్లికూతురు
కుటుంబ పోషణ కోసం, ఇంటి అద్దె కట్టడం కోసం ఇంతకాలం వర్షా దగ్గర ఉన్న బంగారు నగలు కుదవపెట్టి కాలం గడుపుతూ వచ్చారు. రానురాను కొంత జంట వర్షా, పళనిల మధ్య గొడవలు మొదలై అభిప్రాయబేధాలు వచ్చాయి. పళనితో కలిసి జీవించలేనని నిర్ణయించుకున్న వర్షా జనవరి నెలలో ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. ఆర్థిక అవసరాల కోసం వర్షా నగలు అమ్మి, కొన్ని నగలు తాకట్టు పెట్టి కుటుంబాన్ని నడిపిన పళని, వర్షా విడిపోయారు.

వదిలిపెట్టని ప్రియుడు
పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే వర్షా పుట్టింటికి వెళ్లిపోవడతో పళని అవమానంగా బావించాడు. మళ్లీ తనతో కలిసి జీవించాలని పళని అతని భార్య వర్షా మీద ఒత్తిడి శాడు. పళనితో మళ్లీ కలిసి జీవించాలనే కోరిక వర్షాకు లేకపోవడంతో తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలని డిసైడ్ అయిపోయి భర్త పళని ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వర్షా అతనికి పూర్తిగా దూరం కావాలని డిసైడ్ అయ్యిందని తెలిసింది. అయితే పళని మాత్రం అతని భార్యను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది.

నడిరోడ్డు మీద భార్యను చంపేసిన శాడిస్టు
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వర్షా ఆమె ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. టైమ్ కోసం ఎదురు చూస్తున్న పళనికి విషయం తెలిసింది. ఆ సమయంలో హెల్మెట్ వేసుకుని బైక్ మీద వేగంగా వచ్చిన పళని క్షణాల్లో కత్తితో వర్షా మెడ, ముఖంపై దారుణంగా పొడిచేశాడు. భర్త పళని అకస్మాత్తుగా దాడి చెయ్యడంతో వర్షాకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. భార్య వర్షాను స్పాట్ లో చంపేసిన పళని అక్కడి నుంచి బైక్ లో వేగంగా వెళ్లిపోయాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ?
నడిరోడ్డులో యువతి హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు పరుగు తీశారు. సౌత్ గేట్ పోలీసులు అక్కడికి చేరుకుని వర్షా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టపగలు భార్య వర్షాను దారుణంగా హత్య చేసిన పరారైనా పళని కోసం వెతికారు. చివరికి కీరతురా ప్రాంతంలో పళని పోలీసులకు చిక్కిపోయాడు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications