బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Love marriage: నా భార్య పదేపదే బలవంతం చేస్తోంది, కోర్టుకు వెళ్లిన భర్త, కోర్టు ఆదేశాలతో ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: యువతి. యువకుడు ప్రేమించుకుని గుడిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన తరువాత దంపతులు ప్రత్యేకంగా కాపురం ఉంటున్నారు. పుట్టింటికి వెళ్లి వస్తున్న భార్య రానురాను ఆమె భర్తకు సినిమా చూపించింది. మతం మారడానికి నిరాకరించిన భర్త మీద అనవసరంగా పోలీసు కేసులు పెట్టింది. తెలిసినవాళ్లు, చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి దగ్గర అప్పులు చేసిన భార్య ఆమె భర్త పని చేస్తున్న చోటకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పింది. భర్తతో పాటు అతని తల్లిదండ్రులు మతం మారకుంటా వరకట్నం వేధింపుల కేసు పెడుతానని భార్య బ్లాక్ మెయిల్ చేసింది. భార్య తీరుతో విసిగిపోయిన భర్త కోర్టులో ప్రైవేట్ కేసు వెయ్యడంతో అక్కడ భార్యకు అసలు కథ మొదలైయ్యింది.

Marriage: నాలుగు దిక్కుల్లో నలుగురు భర్తలు, ఐదో వాడి కోసం వేటలో ?, మేడమ్ కు 32 ఫోన్ నెంబర్లు !Marriage: నాలుగు దిక్కుల్లో నలుగురు భర్తలు, ఐదో వాడి కోసం వేటలో ?, మేడమ్ కు 32 ఫోన్ నెంబర్లు !

 లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ లోని అశోక్ పురంలో దీపక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సునీతా అలియాస్ సునీతా గ్రేసీ అనే యువతి దీపక్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం ప్రేమించున్న దీపక్, సునీతా 2019 జనవరి 18వ తేదీన ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గుడిలో పెళ్లి చేసుకున్నారు.

 బయటఊర్లకు ఎక్కువగా వెలుతున్న భర్త

బయటఊర్లకు ఎక్కువగా వెలుతున్న భర్త

వివాహం జరిగిన తరువాత దీపక్, సునితా దంపతులు ప్రత్యేకంగా అశోకపురంలో అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. వెల్డింగ్ పని చేస్తున్న దీపక్ ఎక్కువగా బయట ఊర్లకు వెళ్లి పని చేస్తూ అతని భార్య సునీతాకు డబ్బులు పంపిస్తున్నాడు భర్త దీపక్ బయట ఊర్లకు వెళ్లిన సమయంలో పుట్టింటికి వెళ్లి వస్తున్న సునితా రానురాను ఆమె భర్త దీపక్ కు సినిమా చూపించింది.

 క్రైస్తవ మతం స్వీకరించాలని భార్య ఒత్తిడి

క్రైస్తవ మతం స్వీకరించాలని భార్య ఒత్తిడి

దీపక్ బయట నుంచి డబ్బులు పంపిస్తున్నా ఆ డబ్బుతో జల్సా చేస్తున్న సునీతా సక్రమంగా ఇంటి అద్దె చెల్లించడం లేదని తెలిసింది. తరువాత ఇంటి యజమాని దీపక్ నుంచి ఇంటి అద్దె వసూలు చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని దీపక్ ప్రశ్నిస్తే నువ్వు హిందూ మతం వదిలేసి క్రైస్తవ మతం స్వీకరించాలని, అప్పుడు నువ్వు చెప్పినట్లు వింటానని సునితా ఎదురుతిరిగింది.

 మిస్సింగ్ కేసులు పెట్టిన భార్య

మిస్సింగ్ కేసులు పెట్టిన భార్య

తాను చచ్చినా క్రైవస్తవ మతం స్వీకరించనని, తాను జీవితాంతం హిందువుగానే ఉంటానని దీపక్ అతని భార్య సునితాకు తేల్చి చెప్పాడు. దీపక్ బయట ఊర్లలో పని చెయ్యడానికి వెళ్లిన తరువాత తన భార్య కనపడటం లేదని సునితా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దీపక్ కోసం గాలించిన సమయంలో అతను పనికి వెళ్లాడని వెలుగు చూసింది.

 భర్తకు చెమటలు పట్టించింది

భర్తకు చెమటలు పట్టించింది

ఇప్పటి వరకు తన భర్త దీపక్ కనపడటం లేదని సునితా మూడుసార్లు మిస్సింగ్ కేసు పెట్టింది. నువ్వు మతం మారే వరకు తాను ఇలాగే నీమీద కేసులు పెడుతానని సునితా ఆమె భర్తను బెదిరించింది. తెలిసినవాళ్లు, చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి దగ్గర అప్పులు చేసిన సునితా ఆమె భర్త దీపక్ పని చేస్తున్న వెల్డింగ్ షాపు దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పింది.

 కోర్టును ఆశ్రయించిన భర్త

కోర్టును ఆశ్రయించిన భర్త

భర్త దీపక్ తో పాటు అతని తల్లిదండ్రులు క్రైస్తవ మతం స్వీకరించకుంటే వరకట్నం వేధింపుల కేసు పెడుతానని సునితా, ఆమె తల్లిదండ్రులు బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. భార్య సునితా తీరుతో విసిగిపోయిన దీపక్ ఓపిక నసించిపోయి చివరికి బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో ప్రైవేట్ కేసు వేశాడు.

 కోర్టు ఆదేశాలతో భార్య మీద కేసు

కోర్టు ఆదేశాలతో భార్య మీద కేసు

కోర్టు పిటిషన్ విచారణ చేసి సునితా మీద కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహాలక్ష్మి లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బలవంతంగా మతమార్పిడి చెయ్యడం నేరమని, సునితా, ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా దీపక్ తో మతం మార్పించారని వెలుగు చూస్తే వారి పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చుతామని మహాలక్ష్మి లేఔట్ పోలీసులు తెలిపారు. మొత్తం మీద క్రైస్తవ మతం స్వీకరించాలని భార్య ఆమె భర్త మీద ఒత్తిడి చెయ్యడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Love marriage: Wife forcing me to convert, husband complains in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X