వారిద్దరిదీ లైలా-మజ్నూల కంటే ఘాటు ప్రేమ: లైలా ఎవరో, మజ్నూ ఎవరో నన్ను అడగొద్దు!

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లపై హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. వారిద్దరి మధ్య విడదీయరాని ప్రేమానుబంధం ఉందని అన్నారు. మోడీ-నితీష్ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారని చురకలు అంటించారు. మోడీ-నితీష్ జోడీలది లైలా-మజ్నూ కంటే ఘాటు ప్రేమ అని విమర్శించారు. వారిలో ఎవరు లైలా, ఎవరు మజ్నూ అనే విషయాన్ని తనను అడగొద్దని, ,ప్రజలే నిర్ధారించాలని ఒవైసీ ఎద్దేవా చేశారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒవైసీ ఒవైసీ బిహార్ లోని పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు, బహిరంగ సభలో పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ బిహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అఖ్తర్ ఉల్ రెహ్మాన్.. కిషన్ గంజ్ లోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభల్లో ఒవైసీ పాల్గొన్నారు. బీజేపీ-జనతాదళ్ (యునైటెడ్) పొత్తులపై ఒవైసీ ఘాటుగా విమర్శలు చేశారు.

Love of Modi-Nitish Kumar is stronger than Laila-Majnu says Asaduddin Owaisi

మోడీ-నితీష్ ల జోడీని లైలా మజ్నూతో పోల్చారు. మోడీ-నితీష్ కుమార్ లు ఆధునిక లైలా-మజ్నూ గా తయారయ్యారని విమర్శించారు. అజరామర ప్రేమికులుగా లైలా-మజ్నూలు చరిత్రలో నిలిచిపోయారని, మోడీ-నితీష్ ల జోడీ హిందువులు, ముస్లింల మద్య చిచ్చు పెడుతోందని ఒవైసీ ఆరోపించారు. ఒకవైపు బీజేపీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్ని ఎన్నికల్లో ప్రచారం చేస్తూనే.. మరోవైపు- ముస్లింలను దగా చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ సుల్తాన్ పూర్ ఎన్నికల సభలో చేసిన కొన్ని వివాాదాస్పద వ్యాఖ్యానాలను ఒవైసీ ప్రస్తావించారు. ముస్లింలు తనకు ఓటు వేయకపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని స్వయంగా ఓ కేంద్రమంత్రి బెదిరించడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు.

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనతాదళ్ (యునైటెడ్)-బీజేపీ-లోక్ జనశక్తి పార్టీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 40 లోక్ సభ స్థానాలు ఉన్న బిహార్ లో జేడీ (యు), బీజేపీ 17 స్థానాల్లో చొప్పున పోటీ చేస్తున్నాయి. మిగిలిన ఆరు స్థానాలను రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి కేటాయించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+