కొత్త స్టైల్‌లో ప్రపోజ్ అంటూ.. కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన ప్రియురాలు !!

బెంగళూరులో ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారి తీసిన సంఘటన కలకలం రేపుతోంది. నగరంలోని వాయువ్య ప్రాంతంలో ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచి.. కొత్త స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని చెప్పి కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి కిరోసిన్ పోసి సజీవదహనం చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమవ్వగా.. యువకుడు మృతి చెందగా, యువతిని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా పోలీసుల వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రేమా, మృతుడు కిరణ్ ఇద్దరూ ఒకే మొబైల్ స్టోర్‌లో పనిచేస్తూ పరిచయం పెంచుకుని గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల వివాహం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కిరణ్ పెళ్లికి అంగీకరించకపోవడం ప్రేమాకు ఆగ్రహానికి దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

lover-killed-boyfriend-in-bengaluru-that-blind-fold-him-by-saying-different-proposal-but-pouring-kir

ముందస్తు ప్రణాళికతో నేరం..

ఈ క్రమంలోనఏ ఘటన జరిగిన రోజు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమా కిరణ్‌ను తన నివాసానికి ఆహ్వానించింది. మొదట ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అతనిని నమ్మబలికింది. అనంతరం అతని కళ్లకు గంతలు కట్టి, చేతులు కాళ్లు కట్టేసింది. ఆ తర్వాత అప్పటికే కొనుగోలు చేసిన కిరోసిన్ పోసి తగలబెట్టింది. అయితే ఇంట్లో నుంచి కేకలు, పొగ రావడం గమనించిన పొరుగువారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

కానీ మొదట ప్రేమా చెప్పిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానించారు. అయితే ఆమె వాఖ్యాల్లో అనేక వ్యత్యాసాలు కనిపించడంతో కేసు దిశ మారింది. చివరకు ఆమె నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు.

ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా, పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. నిందితురాలి ఫోన్, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన మరోసారి మనుషుల మధ్య భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో గుర్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+