Lover: ఇస్లాం మతంలోకి మారలేదని ప్రియురాలి మీద ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్, ప్రియుడి స్కెచ్, గర్బవతి !
భోపాల్/ముంబాయి/హైదరాబాద్: మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను ప్రేమపేరుతో లొంగదీసుకున్నాడు. అమ్మాయితో నిర్జనప్రదేశాలకు వెళ్లిన ప్రియుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ప్రియుడు ఒత్తిడి చేశాడు. ఇస్లాం మతం స్వీకరించడానికి అమ్మాయి నిరాకరించడంతో ప్రియుడు రెచ్చిపోయాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రియురాలి మీద ప్రియుడు అత్యాచారం చేశారు. అమ్మాయి మీద నలుగురు అత్యాచారం చేసి మాలో ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. అమ్మాయి గర్బవతి కావడంతో ప్రియుడు, అతని ఫ్రెండ్స్ అరాచకాలు బయటకు రావడం కలకలం రేపింది.
Recommended Video

మారు పేరుతో అమ్మాయికి వల
మహారాష్ట్రలోని మలేగావ్ ప్రాంతంలో 15 ఏళ్ల అమ్మాయి ఆమె తల్లిదండ్రుతో కలిసి నివాసం ఉంటూ కూలి పని చేస్తోంది. మధ్యప్రదేశ్ లోని బార్వాని జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ సభ్యులు మలేగావ్ కు వలస వెళ్లారు. మలేగావ్ లో నివాసం ఉంటున్న మాజిద్ ఖాన్ (23) అనే యువకుడు తన పేరు మోహిత్ అంటూ ఆ అమ్మాయిని గత ఏడాదిలో పరిచయం చేసుకున్నాడు.

ప్రేమ పేరుతో ఎంజాయ్
మైనర్ అమ్మాయితో పరిచయం పెంచుకున్న మోజిద్ తరువాత నిన్ను ప్రేమిస్తున్నానని అమ్మాయి వెంట తిరిగాడు. కొంతకాలానికి అమ్మాయి కూడా మోజిద్ వ్యామోహంలో పడిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు తెలీకుండా ఆ అమ్మాయి మోజిద్ వెంట తిరుగుతూ అతనితో ఎంజాయ్ చేసింది.

ఇస్లాం మతం స్వీకరించాలని ఒత్తిడి
కొన్ని నెలల నుంచి ఎంజాయ్ చేస్తున్న ప్రియుడు మోజిద్ ను పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చెప్పింది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇస్లాం మతం స్వీకరించాలని మోజిద్ ఆమె మీద ఒత్డిడి చేశాడు. మతం మారడానికి ఆ అమ్మాయి అంగీకరించలేదని తెలిసింది. తన ప్రియురాలు ఇస్లాం మతం స్వీకరించలేదని మోజిద్ రగిలిపోయాడు.

ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్
గత ఏడాది అక్టోబర్ నెలలో ముగ్గురు స్నేహితులతో కలిసి తన ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్ చెయ్యాలని మోజిద్ ప్లాన్ వేశాడు. ప్రియురాలిని నమ్మించిన మోజిద్ ఆమెను నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లాడు. తరువాత ముగ్గురు స్నేహితులతో కలిసి మోజిద్ ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్ చేశాడు. నువ్వు మతం మారి మాలో ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని ప్రియుడు మోజిద్ ఆ అమ్మాయికి చెప్పాడు.

గర్బవతి...... ప్రియుడు అరెస్టు
అమ్మాయి జరిగిన విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. కేసు పెట్టడానికి భయపడిన అమ్మాయి కుటుంబ సభ్యులు బాధితురాలిని ఉజ్జయినిలోని సోదరి ఇంటికి పంపించేశారు. ఏప్రిల్ నెలలో అమ్మాయికి ఎక్కువ కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. అమ్మాయి గర్బవతి అని వైద్యులు చెప్పారు. అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తియ్యడానికి ప్రయత్నించడంతో ఆ బిడ్డ ప్రాణం పోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు మోజిద్ ను అరెస్టు చేశారు.

కామాంధులు ఎస్కేప్
ప్రియుడు మోజిద్ ను అరెస్టు చేసిన తరువాత అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన మరో ముగ్గురు పరారైనారని ఎజ్జయిని ఏఎస్పీ అమరేంద్ర సింగ్ చెప్పారని హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇస్లాం మతం స్వీకరించడానికి అంగీకరించని ప్రియురాలి మీద ఆమె ప్రియుడు, అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications