Lover: ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు, ప్రియుడు ఏం చేశాడంటే ?, వైరల్, నరాలు కట్ !

బెంగళూరు/ లక్నో: యువతికి మాయమాటలు చెప్పి ఆమెను వలలో వేసుకున్న కేటుగాడు ప్రేమ పేరుతో ఆమెకు మరింత దగ్గర అయ్యాడు. లవ్.... చింతకాయి అంటూ ఆమెతో కలిసి ఎక్కడెక్కడో తిరిగేశాడు. తెలివితేటలు ఉపయోగించిన కిలాడీ ప్రియుడు అతని ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు సంపాధించాడు. అందమైన ప్రియురాలి నగ్న ఫోటోలను ఫ్రెండ్స్ కు, వాళ్ల ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ ల్లో, పలువురి మెయిల్ అడ్రస్ లకు పంపించడమే కాకుండా ఆ నగ్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసేసి చేతులు దులుపుకున్నారు. ప్రియురాలి జీవితాన్ని నాశనం చేసిన ప్రియుడు వేరే రాష్ట్రానికి పారిపోయాడు.

 యూపీ కేటుగాడు

యూపీ కేటుగాడు

ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజేంద్రసింగ్ జీవన్ సింగ్ బిషత్ (21) అనే యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. కర్ణాటకలోని విజయపురకు చెందిన 23 ఏళ్ల అందమైన అమ్మాయి రాజేంద్రసింగ్ కు సోషల్ మీడియాలో కొంతకాలం క్రితం పరిచయం అయ్యింది. అప్పటి నుంచి రాజేంద్ర సింగ్, ఆ అమ్మాయి టచ్ లో ఉన్నారు.

లవ్, చింతకాయ అంటూ స్కెచ్

లవ్, చింతకాయ అంటూ స్కెచ్

అమ్మాయితో టచ్ లో ఉంటూ ఆమెకు మాయమాటలు చెప్పిన కేటుగాడు రాజేంద్రసింగ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమె ఫోన్ నెంబర్ తీసున్నాడు. ఇద్దరూ ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకుంటూ వీడియో కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలానికి అమ్మాయి కూడా రాజేంద్ర సింగ్ కు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.

 కిలాడీ తెలివితేటలు

కిలాడీ తెలివితేటలు

రాజేంద్రసింగ్ ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆ అమ్మాయి అతన్ని గుడ్డిగా నమ్మేసింది. రెండుమూడు సార్లు విజయపురకు వెళ్లిన రాజేంద్రసింగ్ ఆమెను రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి ఏకాంతంగా గడిపాడు. తరువాత తెలివితేటలు ఉపయోగించిన రాజేంద్రసింగ్ ప్రియురాలు నగ్న ఫోటోలు, వీడియోలు సంపాధించాడు.

 బతుకు బస్ స్టాండ్ చేశాడు

బతుకు బస్ స్టాండ్ చేశాడు

ప్రేమపేరుతో ప్రియురాలు నగ్న ఫోటోలు, వీడియోలు సంపాధించిన రాజేంద్రసింగ్ వాటిని స్నేహితులకు, ఫ్రెండ్ వాట్సాప్ గ్రూపులు, కొంతమందికి మెయిల్ ద్వారా వాటిని షేర్ చేశాడు. అంతటితో వదలని రాజేంద్రసింగ్ ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చెయ్యడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.

 యూపీలో ఉంటే వదలేస్తారా ?

యూపీలో ఉంటే వదలేస్తారా ?

కొంత మంది తెలిసినవాళ్లు యువతి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసి ఆమెకు సమాచారం ఇచ్చారు. తన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసి షాక్ అయిన ఆ అమ్మాయి విజయపుర పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్ వెళ్లిన కర్ణాటక పోలీసులు అక్కడ తలదాచుకున్న రాజేంద్రసింగ్ ను పట్టుకున్నారు.

Recommended Video

    Tv Actress Sravani మరణంలో షాకింగ్ విషయాలు | శారీరకంగా ప్రియుడి వేధింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తూ !
     నరాలు లాగేసి పిండేశారు

    నరాలు లాగేసి పిండేశారు

    ఉత్తరప్రదేశ్ నుంచి రాజేంద్రసింగ్ ను కర్ణాటకలోని విజయపురకు పిలుచుకుని వచ్చి అతని నరాలు నిలువుగా పిండేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో రాజేంద్రసింగ్ జైల్లో ఉన్నాడు. సోషల్ మీడియాలో గుడ్డిగా కేటుగాళ్లను నమ్మింతే ఇలాంటి పరిస్థితులు ఎదురౌతాయని, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మనవి చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+