Boyfriend: ప్రియురాలి ప్రాణం కాపాడాలని ప్రియుడు ఏం చేశాడంటే, టెక్కీ సజీవదహనం, పంతం !

చెన్నై/ రామనాథపురం: ఇంజనీరింగ్ చదివే సమయంలో అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మంచి ఉద్యోగం చేసి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని ప్రియుడు డిసైడ్ అయ్యాడు. ఉద్యోగం కోసం అతను సిటీకి వెళ్లాడు. అంతే అమ్మాయి ప్రేమ విషయం ఆమె ఇంట్లో తెలిసోయింది. పెద్దలు ఏం చెయ్యాలో అదే చేసి ఆమె మొబైల్ ఫోన్ లాక్కొన్నారు. ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని ప్రియుడు ఆమె కుటుంబ సభ్యులకు మనవి చేశాడు. గొడవ పెద్దది అయ్యి పోలీసు కేసు అయ్యింది. అమ్మాయిని చంపేస్తే పీడపోతుందని ప్రియురాలి కుటుంబ సభ్యులు అబ్బాయికి చెప్పారు. నా ప్రియురాలు చనిపోకూడదు, నేనే చనిపోతే సమస్య తీరిపోతుందని, నా ప్రేయసి జీవితాంతం సంతోషంగా ఉండాలని చెప్పిన ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోలీసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ఇంజనీరింగ్ కాలేజ్ లో పరిచయం

ఇంజనీరింగ్ కాలేజ్ లో పరిచయం

తమిళనాడులోని రామనాథపురం జిల్లా, ఆర్ఎస్ మంగళం సమీపంలోని ధర్మపురం గ్రామానికి చెందిన విజయ్ (25) శివగంగై జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివాడు. శివగంగై జిల్లా కరైకుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న అనర్ణ శ్రీ అలియాస్ అపర్ణ (25) అనే యువతి కూడా అదే ఇంజనీరింగ్ కాలేజ్ లో బీఇ చదివింది.

 ప్రేమికుల హ్యాపీలైఫ్

ప్రేమికుల హ్యాపీలైఫ్

కాలేజ్ లో చదివే సమయంలో విజయ్, అపర్ణ శ్రీకి పరిచయం అయ్యింది. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసే సమయానికి ప్రేమికులు అయ్యారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మంచి ఉద్యోగాలు చేసి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని విజయ్, అపర్ణశ్రీ నిర్ణయించారు. కాలేజ్ లో విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.

 ప్రియురాలి ఇంట్లో మ్యాటర్ లీక్

ప్రియురాలి ఇంట్లో మ్యాటర్ లీక్

ఉద్యోగం సంపాధించడానికి విజయ్ చెన్నై సిటీ చేరుకున్నారు. ఉద్యోగ వేటలో ఉన్న ప్రియుడు విజయ్ కు షాకింగ్ విషయం తెలిసింది. తన ప్రియురాలు అపర్ణ శ్రీ ఇంట్లో ప్రేమ విషయం తెలిసిపోయిందని, ఆమె మొబైల్ ఫోన్ కూడా లాక్కొన్నారని, ఆమెను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని స్నేహితులు చెన్నైలో ఉన్న ప్రియుడు విజయ్ కి సమాచారం ఇచ్చారు.

 పెళ్లి చెయ్యమని వేడుకున్న ప్రియుడు

పెళ్లి చెయ్యమని వేడుకున్న ప్రియుడు

తన ప్రియురాలు దూరం అవుతోందని ఆవేదనతో విజయ్ తట్టుకోలేకపోయాడు. నేరుగా శివగంగై జిల్లాలోని కరైకుడిలోని ప్రియురాలు అపర్ణశ్రీ ఇంటి దగ్గరకు వెళ్లిన విజయ్ తాను ఇంజనీరింగ్ పూర్తి చేశానని, మా పెళ్లి చేస్తే నేను మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని విజయ్ ప్రియురాలి తల్లిదండ్రుల కాళ్లు పట్టుకున్నాడు.

 ప్రియుడి మీద కేసు

ప్రియుడి మీద కేసు

అయితే తమ అమ్మాయిని విజయ్ వేధింపులకు గురి చేస్తున్నాడని అపర్ణశ్రీ కుటుంబ సభ్యులు కరైకుడి మహిళా పోలీస్ స్టేషన్ లో విజయ్ మీద కేసు పెట్టారు. పోలీసులు విజయ్ కి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఆమె ఇంటి దగ్గరకు వెళితే ఈవ్ చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రియురాలు అపర్ణశ్రీ కుటుంబ సభ్యులను ఎలాగైనా ఒప్పించాలని విజయ్ అనేక ప్రయత్నాలు చేశాడు

 అమ్మాయిని చంపేస్తామని వార్నింగ్

అమ్మాయిని చంపేస్తామని వార్నింగ్

ఇదే సమయంలో మా కూతురు అపర్ణశ్రీని చంపేస్తే నీ ధరిద్రం వదులుతుందని, ఆ పని మేము కచ్చితంగా చేస్తామని ఆమె తల్లిదండ్రులు ఆవేశంతో విజయ్ ని బెదిరించారు. నా కారణంగా నా ప్రియురాలు అపర్ణశ్రీని చంపేస్తారని ప్రియుడు విజయ్ ఆవేదన చెందాడు, స్నేహితులు, బందువుల సహాయంతో అపర్ణశ్రీ కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించాలని విజయ్ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

Recommended Video

    Telangana Lockdown : జాతరను మరిపించిన వైన్ షాపులు.. గంటలకొద్దీ క్యూలైన్ లో
     ప్రియురాలిని కాపాడాలని ప్రియుడి ఆత్మహత్య

    ప్రియురాలిని కాపాడాలని ప్రియుడి ఆత్మహత్య

    అపర్ణశ్రీ కుటుంబ సభ్యులు ఆమెను చంపినా చంపేస్తారని విజయ్ భయపడ్డారు. క్యాన్ లో పెట్రోల్ తీసుకుని అపర్ణశ్రీ ఇంటి ముందుకు వెళ్లిన విజయ్ నా కారణంగా మీ అమ్మాయిని చంపకండి, ఇంత గొడవకు నేనే కారణం, నేను చచ్చిపోతా అంటూ మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు తట్టుకోలేక విజయ్ గట్టిగా కేకలు వేశాడు. స్థానికులు విషయం గుర్తించి మంటలు అదుపు చేసి విజయ్ ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రియుడు విజయ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రియురాలి ప్రాణాలు కాపాడటానికి ప్రియుడు విజయ్ పెట్రోల్ పోసుకుని సజీవదహనం కావడం తమిళనాడులో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+