Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: రాత్రి ఆలోచించారు, ఏం చెయ్యాలో తెలీలేదు, కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ?, ఏం జరిగిందంటే !

బెంగళూరు: కొంతకాలం వరకు యువతి, యువకుడు సంతోషంగా కలిసి తిరిగారు. యువతి, యువకుడి స్నేహం ప్రేమగా మారింది. హ్యాపీగా ఎంజాయ్ చేసిన ప్రేమికులు తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రేమికుల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని తెలిసింది. ఇదే విషయంలో యువతి, యువకుడు ఆవేదన చెందారని సమాచారం. యువతి, యవకుడు సిటీలోని నిర్జనప్రదేశంలోకి వెళ్లి కొంత సమయం కాలం గడిపారు. తరువాత కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వేగంగా వెలుతున్న రైలు ఢీకొనడంతో ఇద్దరి శవాలు నుజ్జునుజ్జు కావడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న యువతి, యువకుడి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ప్రేమికులు

ప్రేమికులు

బెంగళూరు సమీపంలోని కెలమంగలకు చెందిన చేతన్ (19) అనే యువకుడు, శిరి చంద్ర అలియాస్ శిరి (20) అనే యువతికి కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. కొంతకాలం వరకు చేతన్, శిరి చంద్ర సంతోషంగా కలిసి తిరిగారు. చేతన్, శిరి చంద్రల స్నేహం ప్రేమగా మారింది.

 ఆవేదన చెందిన యువతి, యువకుడు

ఆవేదన చెందిన యువతి, యువకుడు

హ్యాపీగా ఎంజాయ్ చేసిన ప్రేమికులు శిరి, చేతన్ తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రేమికులు చేతన్, శిరి చంద్రల పెళ్లికి వాళ్ల పెద్దలు అంగీకరించలేదని తెలిసింది. ఇదే విషయంలో శిరి చంద్ర, చేతన్ ఆవేదన చెందారని సమాచారం. అయితే చేతన్, శిరి చంద్రకు వాళ్ల స్నేహితులు నచ్చచెప్పారని, పెళ్లి చేసుకుంటే పెద్దలు రాజీ అవుతారని సర్ది చెప్పారని సమాచారం.

 కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి !

కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి !

చేతన్, శిరి చంద్ర బెంగళూరు సిటీలోని హోరమావు సమీపంలోని రైలు పట్టాల దగ్గరకు వెళ్లి కొంత సమయం కాలం గడిపారు. రాత్రి 7. 30 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరిన కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి చేతన్, శిరి చంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. వేగంగా వెలుతున్న రైలు ఢీకొనడంతో ఇద్దరి శవాలు నుజ్జునుజ్జు కావడం కలకలం రేపింది.

 లవ్ మ్యారేజ్ ?

లవ్ మ్యారేజ్ ?

విషయం తెలుసుకున్న చేతన్, శిరి చంద్ర కుటుంబ సభ్యులు, వాళ్ల స్నేహితులు హడలిపోయారు. కొంతకాలం క్రితం చేతన్, శిరి చంద్ర ప్రేమ వివాహం చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. బయ్యప్పనహళ్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+