Lovers: పక్కింటిటోడితో వివాహిత మహిళ జంప్, హైదరాబాద్ లో వెతికితే వాటర్ ట్యాంక్ లో ?

జైపూర్/రాజస్థాన్: కుటుంబ సభ్యులు వారి కుమార్తెకు మంచి వరుడిని చూసి పెళ్లి చేశారు. భర్త ఇంటికి వెళ్లిన భార్య అతనితో కాపురం చేస్తోంది. భార్య అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి వస్తోంది. తల్లిదండ్రులు కూతురి ఇంటికి వెళ్లివస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ కనపడకుండా పోయింది. భార్య కోసం ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పలు ప్రాంతాల్లో గాలించి చివరికి పోలీసు కేసు పెట్టారు. నా భార్యను పక్కింటిలో నివాసం ఉంటున్న యువకుడు కిడ్నాప్ చేశాడని భర్త కేసు పెట్టాడు. పోలీసులు ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కనపడకుండా పోయిన వివాహిత మహిళ, పెళ్లికాని యువకుడు పొలంలోని వాటర్ ట్యాంక్ లో ఒకేసారి శవాలై కనిపించడం కలకలం రేపింది.

 ఆరు నెలల క్రితం పెళ్లి

ఆరు నెలల క్రితం పెళ్లి

రాజస్థాన్ లో నివాసం ఉంటున్న ఛన్నాని (19) అనే యువతికి, బార్మార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న విష్ణురామ్ సింధారి అనే యువకుడికి ఆరు నెలల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఛర్నానికి మంచి వరుడు చిక్కాడని, ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు.

 అందరూ హ్యాపీ

అందరూ హ్యాపీ

భర్త విష్ణరామ్ సింధారి ఇంటికి వెళ్లిన ఛర్నాని అతనితో సంతోషంగా కాపురం చేస్తోంది. ఛర్నాని అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి వస్తోంది. తల్లిదండ్రులు కూతురి ఛర్నాని ఇంటికి వెళ్లివస్తున్నారు. ఆరు నెలల నుంచి ఛర్నాని, విష్ణురామ్ సింధారిల మద్య ఎలాంటి సమస్యలు కాని, చిన్నచిన్న గొడవలు కాని రాకపోవడంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఫీలైనారు.

 మాయం అయిన భార్య

మాయం అయిన భార్య

నవంబర్ 14వ తేదీన ఛర్నాని భర్త విష్ణురామ్ సింధారి పనిమీద వేరే ఊరికి వెళ్లాడు. అదే రోజు ఛర్నాని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఛర్నాని రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఛర్నాని కనపడకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 పక్కింటోడి మీద కిడ్నాప్ కేసు

పక్కింటోడి మీద కిడ్నాప్ కేసు

భార్య ఛర్నాని కోసం ఆమె భర్త విష్ణురామ్ సింధారి పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు పలు ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఛర్నాని ఆచూకి చిక్కకపోవడంతో చివరికి పోలీసు కేసు పెట్టారు. నా భార్య ఛర్నానిని మా పక్కింటిలో నివాసం ఉంటున్న జోగారామ్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడని ఛర్నాని భర్త విష్ణురామ్ సింధారి పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు ఛర్నాని, జోగారామ్ కోసం గాలిస్తున్నారు

 హైదరాబాద్ లో ప్రియుడికి ఉద్యోగం

హైదరాబాద్ లో ప్రియుడికి ఉద్యోగం

జోగారామ్ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హైమ్ కారణంగా జోగారామ్ సొంత ఊరికి వెళ్లి అక్కడే ఉంటున్నాడని పోలీసులు అన్నారు. వివా

 వాటర్ ట్యాంక్ లో ఇద్దరి శవాలు

వాటర్ ట్యాంక్ లో ఇద్దరి శవాలు

బార్మార్ ప్రాంతంలోని లీలారామ్ అనే వ్యక్తి పొలంలోని వాటర్ ట్యాంక్ లో నుంచి దుర్వాసన వస్తుండటంతో లీలారామ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూడగా వాటర్ ట్యాంక్ లో ఛర్నాని, జోగారామ్ శవాలై కనిపించడం కలకలం రేపింది. ఒకేసారి కనపడకుండా పోయిన వివాహిత మహిళ ఛర్నాని, జోగారామ్ ఒకేసారి వాటర్ ట్యాంక్ లో శవాలై కనిపించడం కలకలం రేపింది.

 ప్రేమలో పడిన వివాహిత మహిళ

ప్రేమలో పడిన వివాహిత మహిళ

విష్ణురామ్ సింధారిని పెళ్లి చేసుకుని ఆరు నెలల కూడా కాకుండానే భర్త పక్కింటిలో నివాసం ఉంటున్న జోగారామ్ తో ఛర్నాని ప్రేమలో పడిందని తెలిసింది. భర్తను వదిలేసి ప్రియుడు జోగారామ్ తో హైదరాబాద్ పారిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఛర్నాని అనుకుందని తెలిసింది. అయితే పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఛర్నానిని, ఆమె ప్రియుడు జోగారామ్ ను హత్య చేసి శవాలు వాటర్ ట్యాంక్ లో వేశారా ?, లేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా ? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని బార్మార్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+