Lovers: స్కెచ్ మార్చిన క్షత్రియుడు, కళ్లల్లో కారం చల్లి, వేటకొడవళ్లతో వెంటాడి, ఫినిష్ !
బెంగళూరు/బాగల్ కోట్: ఒకే ఊరిలో ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరు అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు మ్యాటర్ తెలిసింది. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నిన్ను కచ్చితంగా చంపేస్తానని తండ్రి ఆమె కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. ముందుగా వేసుకున్న స్కెచ్ మార్చిన క్షత్రియ పుత్రుడు అతని కూతుర్ని వదిలేసి అల్లుడిని నడిరోడ్డు మీద వెంటాడి వెంటాడి నరికి చంపేశారు.

క్షత్రియులు
కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని జమఖండి లో తమ్మనగౌడ పాటిల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమ్మనగౌడ పాటిల్ క్షత్రియులు. క్షత్రియుల కులంోల తమ్మనగౌడ పాటిల్ కు మంచి పలుకుబడి ఉంది. రాజకీయంగా ఓ పార్టీతో తమ్మనగౌడ పాటిల్ కు మంచి సంబంధాలు ఉన్నాయని. తమ్మనగౌడ పాటిల్ కు భాగ్యశ్రీ అనే కుమార్తె ఉంది.

ప్రేమికులు
బాగల్ కోటే జిల్లాలోని జమఖండి తాలుకాలోని టోక్కోడలో భుజబలి కర్జగి అలియాస్ భుజబలి (34) అనే యుకుడు నివాసం ఉంటున్నాడు. భజబలి జైన్ మతానికి చెందినవాడు. కొన్ని సంవత్సరాల క్రితం భుజబలి, భార్యశ్రీకి పరిచయం అయ్యింది. భుజబలి, భాగ్యశ్రీ ప్రేమించుకున్నారు. చాలా కాలం పాటు ప్రేమికులు భాగ్యశ్రీ, భుజబలి సంతోషంగా తిరిగారు.

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన తండ్రి
ప్రేమికులు భాగ్యశ్రీ, భజబలి మతాలు వేరు అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని గత ఏడాది డిసైడ్ అయ్యారు. భజబలి ప్రేమ విషయం ప్రియురాలు భాగ్యశ్రీ కుటుంబ సభ్యులకు మ్యాటర్ గత ఏడాది తెలిసింది. నువ్వు భజవలిని పెళ్లి చేసుకుంటే నిన్ను, వాడిని కచ్చితంగా చంపేస్తానని తిమ్మనగౌడ పాటిల్ అతని కూతురికి వార్నింగ్ ఇచ్చాడు.

చెప్పినా మాటవినని కూతురు
నాకు నీ ప్రేమకంటే నా కులం, పరువు ముఖ్యమని తిమ్మనగౌ పాటిల్ కూతురిని హెచ్చరించాడు. కుటుంబ సభ్యులను ఎదిరించిన భాగ్యశ్రీ కొన్ని నెలల క్రితం ఆమె ప్రియుడు భజబలిని గుడిలో పెళ్లి చేసుకుని తరువాత రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న భాగ్యశ్రీ, భజబలి వేరే ఇంటిలో నివాసం ఉంటున్నారు.

క్షత్రియు కులంలో పరువు పోయిందని ?
వ్యాపారం చేస్తున్న భజబలి అతని భార్య భాగ్యశ్రీతో సంతోషంగా ఉన్నాడు. తన కుతూరు భాగ్యశ్రీ జైన్ మతానికి చెందినవాడు భజబలిని పెళ్లి చేసుకుందని, తనకు క్షత్రియ కులంలో విలువలేకుండా పోయిందని తిమ్మనగౌడ పాటిల్ రగిలిపోయాడు. కూతురు భాగ్యశ్రీని చంపడానికి తిమ్మనగౌడ పాటిల్ కు మనసురాలేదు

స్కెచ్ మార్చిన క్షత్రియుడు
కూతురు భాగ్యశ్రీని వదిలేసి అల్లుడిని చంపేయాలని తిమ్మన గౌడ పాటిల్ డిసైడ్ అయ్యాడు. రాత్రి అన్న కొడుకు సుమోద్ తో కలిసి భజబలి బైక్ లో ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో ముగ్గురు బంధువులతో కలిసి తిమ్మనగౌడ పాటిల్ అల్లుడు భుజబలి కళ్లలో కారం చల్లాడు. కళ్లు మండిపొవడంతో భజబలి ఏం చెయ్యాలో తెలిక సతమతయం అయ్యాడు.

వెంటాడి వెంటాడి నరికి చంపేశారు
కళ్లలో కారం చల్లడంతో భజబలి రోడ్డు మీద పరుగు తీశాడు. భజబలిని తిమ్మనగౌడ పాటిల్ అతని బంధువులు వెంటాడి వెంటాడి చంపేశారని సావళలి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మనోహర్ కంచగార మీడియాకు చెప్పారు. తిమ్మనగౌడ పాటిల్ ను అరెస్టు చేశామని, అతని బంధువుల కోసం గాలిస్తున్నామని సావళలి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మనోహర్ కంచగార అన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు భాగ్యశ్రీ భర్త భజబలిని సినిమా లెవల్లో తిమ్మనగౌడ పాటిల్ నరికి చంపడం బాగల్ కోటేలో కలకలలం రేపింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications