Lovers: భర్తను వదిలేసి ప్రియుడితో లేచిపోయిన భార్య, 20 రోజుల్లోనే ఒకే రూమ్ లో ఆత్మహత్య !
బెంగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అందరు ప్రేమికుల్లాగా ఇద్దరూ హ్యాపీగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇద్దరి కులాలు ఒకటే కావడం, ఇద్దరూ బంధువులు కావడంతో కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మనకు కులాలు, ఆస్తులు అంతస్తులు అడ్డురావని ప్రేమికులు చాలా సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే గ్రహాలు అనుకూలించకపోవడంతో ప్రియురాలికి వేరే యువకుడితో వివాహం జరిగిపోయింది. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న మహిళ ఆమె ప్రియుడి మాత్రం మరిచిపోలేకపోయింది. పుట్టింటికి వచ్చిన ప్రతిసారి ప్రియుడితో రెండు మూడు రోజులు గడిపి వెలుతున్న మహిళ ఆమె ప్రియుడిని మాత్రం మరిచిపోలేకపోయింది. 20 రోజుల క్రితం భర్తను వదిలేసిన మహిళ ప్రియుడితో పారిపోయింది. మేము ఇద్దరు దంపతులు అని చెప్పి కొత్తగా అద్దె ఇల్లు తీసుకున్న ప్రేమికులు జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరూ ఒకే రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమికులు...... ముందే బంధువులు
కర్ణాటకలోని రాయచూరుకు చెందిన బసవరాజ్ (28), జ్యోతి (26) అనే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అందరు ప్రేమికుల్లాగా బసవరాజ్, జ్యోతి ఇద్దరూ హ్యాపీగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. బసవరాజ్, జ్యోతి ఇద్దరి కులాలు ఒకటే కావడం, ఇద్దరూ బంధువులు కావడంతో కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

తేడా కొట్టింది...... గ్రహాలు అనుకూలించలేదు
మనకు కులాలు, ఆస్తులు అంతస్తులు అడ్డురావని అనుకున్న ప్రేమికులు బసవరాజ్, జ్యోతి చాలా సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే గ్రహాలు అనుకూలించకపోవడంతో ప్రియురాలు జ్యోతికి వేరే యువకుడితో వివాహం జరిగిపోయింది. వివాహం చేసుకుని భర్తతో కాపురం చెయ్యడానికి జ్యోతి ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది.

ప్రియుడిని మరిచిపోలేకపోయింది
భర్తతో కాపురం చేస్తున్న జ్యోతి ఆమె ప్రియుడు బసవరాజ్ ను మాత్రం మరిచిపోలేకపోయింది. పుట్టింటికి వచ్చిన ప్రతిసారి ప్రియుడు బసవరాజ్ తో రెండు మూడు రోజులు గడిపి వెలుతున్న జ్యోతి చాలాకాలం అయినా ఆమె ప్రియుడు బసవరాజ్ ను మాత్రం మరిచిపోలేకపోయింది. ప్రతిరోజు జ్యోతి ఆమె ప్రియుడు బసవరాజ్ ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటూ టచ్ లో ఉన్నారు.

ప్రియుడితో పారిపోయిన భార్య
20 రోజుల క్రితం భర్తను వదిలేసిన జ్యోతి ఆమె ప్రియుడు బసవరాజ్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి చేరుకున్న ప్రేమికులు బసవరాజ్, జ్యోతి మేము ఇద్దరూ భార్య, భర్తలు అని చెప్పి అదే పట్టణంలోని శాంతినగర్ లో ఓ అద్దె ఇంటిని తీసుకుని కొత్తగా కాపురం పెట్టారు.

ఒకే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు
ఇద్దరు దంపతులు అని చెప్పిన బసవరాజ్, జ్యోతి సంతోషంగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. కొత్తగా అద్దె ఇల్లు తీసుకున్న బసవరాజ్, జ్యోతి జీవితాంతం కలిసి ఉండాలని అనుకుని 20 రోజులుగా దేవనహళ్ళిలో సంతోషంగా తిరిగారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని అద్దెకు ఉంటున్న ఇంటిలొని ఒకే రూమ్ లో బసవరాజ్, జ్యోతి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంటి ఓనర్ కు అనుమానం రావడంతో ?
రెండు రోజులు అయినా ఇంటి నుంచి బసవరాజ్, జ్యోతి బయటకు రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా బసవరాజ్, జ్యోతి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. ప్రేమికులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ? అని కచ్చితంగా తెలీదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications