స్లీపర్ కోచ్ బస్సులో విషం తాగిన ప్రేమికులు, గర్ల్ ఫ్రెండ్ ప్రాణం పోయింది !
బెంగళూరు/హావేరి: కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో ప్రేమికులు విషం తాగి స్లీపర్ కోచ్ బస్సులో పడుకున్నారు. విషం తాగిన యువతి బస్సులోనే మృతి చెందింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బెంగళూరుకు చెందిన హేమా ( 20) అనే యువతి బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కర్ణాటకలోని బాగల్‌కోట్‌కు చెందిన అఖిల్ అనే యువకుడిని హేమా ప్రేమిస్తోంది.

హేమా, అఖిల్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. హేమా, అఖిల్ ల ప్రేమకు ఇరువైపుల ఇళ్లలో వ్యతిరేకత వచ్చింది. రాణేబెన్నూరు నగరంలోని చలగేరి టోల్ సమీపంలోని గ్రీన్ ప్యాలెస్ హోటల్ సమీపంలో ప్రేమికులు విషం తాగి తరువాత స్లీపర్ కోచ్ బస్సులో నిద్రపోయారు. స్పృహ కోల్పోయిన అఖిల్‌ను ఆసుపత్రిలో చేర్పించారు.
అఖిల్ ఆరోగ్యం కోలుకోవడంతో మంగళవారం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరోవైపు విషం తాగిన ప్రియురాలు హేమా మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినందుకు ప్రేమికులు హేమా, అఖిల్ విషం తాగి స్లీపర్ బస్సులో పడుకున్నారు. దురదృష్టవశాత్తు హేమా మరణించింది. మీరు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోయే ముందు హేమా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తాను ముంబాయి వెళుతున్నానని హేమా ఆమె కుటుంబ సభ్యులకు చెప్పిందని తెలిసింది.
తర్వాత ప్రేమికులు విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మధ్యాహ్నం భోజనానికి బస్సు ఆగడంతో బస్సు డ్రైవర్‌కు ప్రేమికులు భోజనం చెయ్యడానికి బస్సు దిగకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. విషయం పసిగట్టిన సాటి ప్రయాణికులు వెంటనే ప్రేమికులు హేమా, నిఖిల్ ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అయితే అప్పటికే హేమా ప్రాణాలు పోయాయని పోలీసులు అన్నారు. ప్రియుడు అఖిల్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలో బయటపడిపోయాడు. ఈ విషయమై రాణేబెన్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటామని ప్రేమికులు ప్రాదేయపడినా ఇరువైపుల కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications