చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lovers: లేచిపోయిన ప్రేమికులు, ప్రియుడి తల్లిని కరెంట్ స్థంభానికి కట్టేసి, ప్రియురాలి తల్లి అండ్ కో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ విరూద్ నగర్: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం అయ్యింది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కాలేజ్ చదువు పూర్తి అయిన వెంటనే యువకుడు ఉద్యోగం చెయ్యడానికి సిటీకి వెళ్లిపోయాడు. ప్రియుడు ఊరికి వచ్చిన ప్రతిసారి ప్రేమికులు కలుస్తున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో రెండు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. అంతే అప్పటి నుంచి రెండు కుటుంబాల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి జరిగితే అన్ని సర్దుకుపోతాయని అనుకున్న ప్రేమికులు స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు. ప్రియుడు ఇప్పటికే ఉద్యోగం చేస్తుండటంతో ఇద్దరు పారిపోయి సిటీలో కాపురం పెట్టారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రేమికుల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదే సమయంలో ప్రియుడి తల్లిని ఇంటి నుంచి బయటకు లాగిన ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెను చితకబాది రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్థాంభానికి కట్టేసి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు అంటూ చిత్రహింసలకు గురి చెయ్యడం కలకలం రేపింది. ప్రియుడి బంధువులు, స్నేహితులు గుమికూడి ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మన కోసం మన కుటుంబ సభ్యులు రోడ్డున పడి దాడులు చేసుకుంటున్నారని తెలుసుకున్న ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాళ్ల స్నేహితులు అంటున్నారు.

Khiladi lady: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు, ఏంకావాలంటే అది ఇస్తానని ?, బాయ్ ఫ్రెండ్ తో!Khiladi lady: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు, ఏంకావాలంటే అది ఇస్తానని ?, బాయ్ ఫ్రెండ్ తో!

ఒకే ఏరియాలో యువతి, యువకుడు

ఒకే ఏరియాలో యువతి, యువకుడు

తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలోని అరుప్పుకోటై సమీపంలోని వాగైకులం ప్రాంతంలో మీనాక్షి (45) అనే మహిళ నివాసం ఉంటున్నది, మీనాక్షికి శక్తిశివ అలియాస్ శివ (24) అనే కొడుకు ఉన్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సుధా అనే మహిళకు భువనేశ్వరి (20) అనే కుమార్తె ఉంది.

కాలేజ్ కు వెళ్లి వస్తూప్రేమలో పడ్డారు

కాలేజ్ కు వెళ్లి వస్తూప్రేమలో పడ్డారు


ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న శక్తిశివ, భువనేశ్వరికి చిన్నప్పటి నుంచి పరిచయం అయ్యింది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో శక్తిశివ, భువనేశ్వరి ప్రేమించుకున్నారు. చాలా కాలం పాటు ఇద్దరూ రహస్యంగా కలుసుకునే వారు. కాలేజ్ చదువు పూర్తి అయిన వెంటనే శక్తిశివ ఉద్యోగం చెయ్యడానికి చెన్నై సిటీకి వెళ్లిపోయాడు. ప్రియుడు శక్తిశివ సొంత ఊరికి వచ్చిన ప్రతిసారి అతని ప్రియురాలు భువనేశ్వరిని కచ్చితంగా కలుస్తున్నాడు.

 కులాలు వేరని పెళ్లికి నిరాకరించిన పెద్దలు

కులాలు వేరని పెళ్లికి నిరాకరించిన పెద్దలు

శక్తిశివ, భువనేశ్వరి ఇద్దరి కులాలు వేరు కావడంతో రెండు వైపుల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. అంతే అప్పటి నుంచి రెండు కుటుంబాల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి జరిగితే అన్ని సర్దుకుపోతాయని అనుకున్న ప్రేమికులు శక్తిశివ, భువనేశ్వరి ఈనెల 22వ తేదీన ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు.

 చెన్నై పారిపోయిన ప్రేమికులు

చెన్నై పారిపోయిన ప్రేమికులు

ప్రియుడు శక్తిశివ ఇప్పటికే ఉద్యోగం చేస్తుండటంతో భువనేశ్వరి అతనితో పారిపోయి పారిపోయి చెన్నై సిటీలో కాపురం పెట్టారు. ప్రియురాలు భువనేశ్వరి కుటుంబ సభ్యులు మా అమ్మాయి కనపడటం లేదని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. ప్రేమికులు శక్తిశివ, భువనేశ్వరి కోసం ఆమె కుటుంబ సభ్యులు వెతుకుతూన్నారు.

ప్రియుడి తల్లిని కరెంట్ ఫోల్ కు కట్టేసి చితకబాదేశారు

ప్రియుడి తల్లిని కరెంట్ ఫోల్ కు కట్టేసి చితకబాదేశారు

ఇదే సమయంలో రగిలిపోయిన భువనేశ్వరి కుటుంబ సభ్యులు శక్తిశివ ఇంటి మీద దాడి చేశారు, ప్రియుడి తల్లి మీనాక్షిని ఇంటి నుంచి బయటకు లాగిన ప్రియురాలు భువనేశ్వరి తల్లి సుధా, నాగవల్లి, సెల్వి, సెల్వపాండి, దురైమురుగన్ తదితర కుటుంబ సభ్యులు ఆమెను చితకబాది రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్థాంభానికి కట్టేసి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు అంటూ చిత్రహింసలకు గురి చెయ్యడం కలకలం రేపింది.

అమ్మాయి తల్లి అండ్ కో మీద పోలీసు కేసులు

అమ్మాయి తల్లి అండ్ కో మీద పోలీసు కేసులు


ఇదే సమయంలో ప్రియుడు శక్తిశివ బంధువులు, అతని స్నేహితులు భువనేశ్వరి కుటుంబ సభ్యుల మీద ఎదురుదాడికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మీనాక్షి మీద దాడి చేసిన అమ్మాయి తల్లి సుధాతో పాటు ఆమె బంధువుల మీద కేసు నమోదు చేశామని, అందరిని అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Lovers: 45 years old woman tied in lamp post after her son eloped with girl from another case near Virudhunagar in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X