Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!

ఇరాన్ వార్ ప్రభావంతో దేశంలో ఎల్పీజీ (LPG) కొరత నానాటికీ తీవ్రమవుతోంది. పశ్చిమాసియా నుంచి రావాల్సిన చమురు, ఎల్పీజీ నౌకలు సకాలంలో రాకపోవడం, రవాణా ఆటంకాలు, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన పరిస్ధితి వచ్చేసింది. భారతదేశం యొక్క దాదాపు 90 శాతం ఎల్పీజీ దిగుమతులు గతంలో హార్ముజ్ జలసంధి ద్వారా జరిగేవి, అక్కడ అంతరాయాలు ఏర్పడటంతో భారత్ పై తీవ్ర ప్రభావం పడుతోంది.

హార్ముజ్ నుంచి 2 నౌకలు తెచ్చిన ఎల్పీజీ 2 రోజులు కూడా సరిపోదా ?
హార్ముజ్ నుంచి 2 నౌకలు తెచ్చిన ఎల్పీజీ 2 రోజులు కూడా సరిపోదా ?

దీనిని ఎదుర్కోవడానికి, భారతదేశం ఇప్పుడు అమెరికా నుండి కొంత ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుండగా, ఆస్ట్రేలియా , రష్యా వంటి దేశాల నుండి ఎల్ఎన్జీ సరఫరాల కోసం ప్రయత్నిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, ఎల్పీజీ పరిస్థితి ఇంకా ఒత్తిడిలోనే ఉందని, ఆన్‌లైన్ బుకింగ్‌లో మెరుగుదల కనిపించిందని, ప్రస్తుతం దాదాపు 93% మంది వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారని పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు.

LPG Crunch Worsens India Eyes US Australia Russia for Supplies
చమురు క్షేత్రాలకు పాకిన ఇరాన్ వార్..! ఆకాశానికి పెట్రో ధరలు..!
చమురు క్షేత్రాలకు పాకిన ఇరాన్ వార్..! ఆకాశానికి పెట్రో ధరలు..!

ఎల్పీజీ వినియోగదారులు ఓపికగా ఉండాలని, ఏజెన్సీల వద్ద గుంపులుగా చేరవద్దని ఆమె కోరారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత, ఏజెన్సీలకు వెళ్లకుండా హోమ్ డెలివరీ కోసం వేచి ఉండాలని, సిలిండర్లు ఇళ్లకు చేరుతాయని హామీ ఇచ్చారు. ఇరాన్, ఖతార్ పంచుకుంటున్న సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో చమురు మంటలకు ఆజ్యం పోసినట్లయింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది, భారత్ కు చేసే రవాణాతో సహా, ప్రపంచ ఎల్ఎన్జి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దాడి చమురు, గ్యాస్ ధరలలో తక్షణ పెరుగుదలకు దారితీసింది. ఈ ప్రాంతంలోని ప్రధాన ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులతో ప్రతిస్పందించింది. వీటిలో సౌదీ అరామ్కోకు అనుబంధంగా ఉన్న సామ్రెఫ్ రిఫైనరీతో పాటు, ఖతార్ , యూఏఈలోని గ్యాస్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

LPG: ఏపీలో గ్యాస్ పరిస్ధితి ఇదీ- తేల్చేసిన చంద్రబాబు..!
LPG: ఏపీలో గ్యాస్ పరిస్ధితి ఇదీ- తేల్చేసిన చంద్రబాబు..!
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+