మరో షాక్: రూ. 50 పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర, 15 నుంచే అమల్లోకి
న్యూఢిల్లీ: మరోసారి వంట గ్యాస్ ధర పెరిగింది. ఓ వైపు పెట్రోల్ ధర ప్రతిరోజూ పెరుగుతూ పోతుండగా.. ఇప్పుడు రూ. 100కు చేరువలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సామాన్యుడి మరింతగా భారం పెంచుతూ రాయితీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు పెంచాయి.
గృహ అవసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచాయి. తాజా పెరుగుదలతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 769కి చేరింది. పెరిగిన ధర సోమవారం (ఫిబ్రవరి 15) నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే పెట్రోల్ భారం మోస్తున్న సామాన్యులకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు మరింత భారం కానున్నాయి.

కాగా, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి, నెలవారీగా సవరించబడతాయి. అంతర్జాతీయ ఇంధన రేట్లు, యూఎస్ డాలర్-రూపాయి మారకపు రేట్లపై ఆధారపడి, ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల అమ్మకాలపై భారత ప్రభుత్వం ప్రస్తుతం వినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా వ్యక్తి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది