గ్యాస్ సిలెండర్ల బుకింగ్ సమయం మరింత పెంపు-కేంద్రం కీలక నిర్ణయం..!
ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న ఎల్పీజీ (LPG) కృత్రిమ కొరతను నివారించడానికి కేంద్రం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి ఎల్పీజీ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయన్న అంచనాల నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలెండర్లను ఎక్కడిక్కడ బ్లాక్ చేస్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ గ్యాస్ సిలెండర్ల బుకింగ్ (LPG Cylinder booking Time) సమయాన్ని మరోసారి పెంచింది.
దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ల నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడానికి బుకింగ్ వ్యవధిని 21 నుండి 25 రోజులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో 55 రోజుల్లో ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకున్న వారు.. తాజా పరిణామాలతో 15 రోజుల్లో సిలిండర్లను బుక్ చేసుకోవడం ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం శుద్ధి కర్మాగారాలకు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. అలాగే వాణిజ్య కనెక్షన్ల కంటే దేశీయ ఎల్పీజీకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశించింది.

గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే అంతర్జాతీయంగా మరికొందరు ఎల్పీజీ పార్ట్ నర్ల కోసం అన్వేషణ కూడా సాగుతోంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు భారతదేశానికి ఎల్పీజీని విక్రయించడానికి సంప్రదించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లు దాటితే తప్ప భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో తగినంత స్టాక్ ఉన్నందున ఇంధన ధరలు పెరిగే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications