వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ తీర్పు: హీరో కమల్, డీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ టీటీవీ దినకరన్ ఏం చెప్పారంటే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Cauvery Water Dispute SC Verdict, Here Are The Reactions

చెన్నై: కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు సంచనల తీర్పు ఇవ్వడంతో తమిళనాడులోని రాజకీయ పార్టీల నాయకులు స్పంధించారు. తమిళనాడుకు అన్యాయం జరిగిందని, తీర్పును మళ్లీ సుప్రీం కోర్టులోనే సవాలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్, హీరో మకల్ హాసన్, టీటీవీ దినకరన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరునావుక్కరసర్ తదితరులు తమిళనాడుకు అన్యాయం జరిగిందని అంటున్నారు.

పరువు పోయింది

పరువు పోయింది

అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్లక్షం కారణంగా తమిళనాడు పరువు పోయిందని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు రైతులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఏమి చెయ్యాలో చర్చించడానికి వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చెయ్యాలని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.

తీర్పుతో షాకయ్యాను

తీర్పుతో షాకయ్యాను

కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు విని తాను షాక్ కు గురైనానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. 2007లో కావేరీ ట్రైబ్యునల్ బోర్డు ఆదేశాల మేరకు తమిళనాడుకు 192 టీఎంసీల నీరు రావాలని, సుప్రీం కోర్టు దానిని తగ్గించి 177 టీఎంసీలు విడుదల చెయ్యాలని తీర్పు ఇవ్వడం విచారకరం అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత తాను మాట్లాడుతానని కమల్ హాసన్ వివరించారు.

బీజేపీ డిమాండ్

బీజేపీ డిమాండ్

కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధకలిగించిందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం వెంటనే తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని తమిళసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.

రైతులకు అన్యాయం

రైతులకు అన్యాయం

కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో తమిళనాడు రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఆరోపించారు. తమిళనాడుకు రైతులే వెన్కెముక అని, వారికి న్యాయం చెయ్యడంలో, సుప్రీం కోర్టులో వాదించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీటీవీ దినకరన్ ఆరోపించారు.

కాంగ్రెస్ తెలివిగా !

కాంగ్రెస్ తెలివిగా !

కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలివిగా మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు వలన రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. అయితే నదీ జలాలు ఏక్క రాష్ట్రం హక్కు కాదని అని సుప్రీం కోర్టు చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పిన తిరునావుక్కరసర్ తెలివిగా తప్పించుకున్నారు.

English summary
M.K.Stalin condemns government for lost the tn rights of cauvery water share and urges government to call for all party meeting immediately. TTV Dinakaran has twitted in about the verdict of the Supreme Court in the Cauvery case is saddening. The verdict is a great damage to the Tamil Nadu farmers. The quantity of agriculture in Tamil Nadu has been questioned now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X