వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ పోరాటం: జేడీఎస్ సామూహిక రాజీనామాలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ జేడీఎస్ పార్టీ ఎంపీలు, శాసన సభ్యులు, జిల్లా పంచాయితీ అధ్యక్షులు, సభ్యులు, తాలుకా పంచాయితీ అధ్యక్షులు, సభ్యులు సామూహిక రాజీనామా చెయ్యాలని నిర్ణయించారు.

జేడీఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎం.ఎస్.పుట్టరాజు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కు ఇచ్చారు. పుట్టరాజు బాటలోనే జేడీఎస్ నాయకులు రాజీనామాలు చెయ్యడానికి సిద్దం అయ్యారు.

M S Puttaraju, JD(S) MP submits resignation to district collector

మండ్య జిల్లా రైతులు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేక విలవిలలాడుతున్నారని, బెంగళూరు నగర ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో తమిళనాడుకు కావేరీ నీళ్లు ఎలా వదలాలి అని జేడీఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

చేతగాని ప్రభుత్వం అధికారంలో ఉండటం వలనే ఇలా జరగుతుందని మండిపడుతున్నారు. వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చెయ్యాలని జేడీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
M S Puttaraju, member of parliament, JD(S) has tendered his resignation. As a mark of protest all JD(S) representatives at the ZP, TP, MPs and MLAs will resign from their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X