Madam: మేడమ్ కు కారు డ్రైవర్, వయసులో 26 ఏళ్లు తేడా, అపార్ట్ మెంట్ లో అంతేనా ?
బెంగళూరు/చెన్నై: ప్రముఖ కంపెనీలో ఆమె సీనియర్ అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు కంపెనీ కారులో ఆఫీసుకు వెళ్లి అదే కారులో ఇంటికి చేరుకుంటున్నది. అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటున్న మహిళ ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరిన తరువాత కనపడకుండా పోయింది. ఇదే సమయంలో నిర్జనప్రదేశంలో ఓ మహిళ శవం బయటపడింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. ఆంటీతో ఇంతకాలం ఎంజాయ్ చేస్తున్న యువకుడే ఆమెను పక్కాప్లాన్ తో చంపేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

మేడమ్ కు పెళ్లి కాలేదు
తమిళనాడుకు చెందిన దీపా (48) అనే మహిళకు చాలా సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోవడంతో దీపా అనాథ అయ్యింది. చిన్నాన పెంపకంలో పెరిగిన దీపా చార్టెడ్ అకౌంట్ స్థాయికి ఎదిగింది. బెంగళూరులోని ఇందిరా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నది. దీపాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఆమెకు ఇంకా పెళ్లికాలేదు.

కంపెనీలో ఉద్యోగం
ఇందిరానగర్ లోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటున్న దీపా ఆమె పాటికి ఆమె ఉంటున్నది. బెంగళూరు నగర శివార్లలోని హోస్ కోటే సమీపంలోని ప్రముఖ కంపెనీలో దీపా అకౌంటెంట్ ఆఫీసర్ గా మంచి ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు దీపా ఇందిరానగర్ లోని ఇంటి నుంచి కంపెనీ కారులో వెళ్లి ఉద్యోగం చేస్తున్నది. అదే కంపెనీ కారులో కంపెనీ నుంచి దీపా ఇందిరా నగర్ లోని ఆమె అపార్ట్ మెంట్ కు చేరుకుంటున్నది.

మేడమ్ మాయం
అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటున్న దీపా ఫిబ్రవరి 27వ తేదీన ఆఫీసుకు వెళ్లింది, తరువాత దీపా ఆఫీసు నుంచి ఇందిరా నగర్ లోని ఆమె ఇంటికి బయలుదేరిన తరువాత కనపడకుండా పోయింది. ఫిబ్రవరి 28వ తేదీన సాతనూరు సమీపంలోని హోసహళ్లి గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో ఓ మహిళ శవమై కనిపించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో హత్యకు గురైయ్యింది దీపానే అని వెలుగు చూసింది.

ఆంటీతో అక్రమ సంబంధం... వయసులో 26 ఏళ్లు తేడా
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. కర్ణాటకలోని కలబురిగికి చెందిన భీమారాయ్ (22) అనే యువకుడు బెంగళూరు చేరుకుని దీపా ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. దీపాకు, భీమారాయ్ కు వయసులో 26 ఏళ్లు తేడా ఉంది. రోజు కారులో దీపాను పికప్ అండ్ డ్రాప్ చేస్తున్న భీమారాయ్ ఆమెతో చనువు పెంచుకుని అక్రమ సంబందం పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

దూరం పెట్టిందని ఆంటీని చంపేసిన ప్రియుడు
కొంతకాలం నుంచి దీపా, భీమారాయ్ మద్య తేడాలు వచ్చాయని తెలిసింది. అయితే ఒకేకారులో కలసి కంపెనీలో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నారని సమాచారం, ఫిబ్రవరి 27వ తేదీన సాయంత్రం దీపా, భీమారాయ్ మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో కారు దిగి నడుచుకుంటున్న వెలుతున్న దీపా మీద భీమారాయ్ ఇనుప రాడ్ తో దాడి చేసి చంపేశాడని, తరువాత శవాన్ని కారులో వేసుకుని సాతనూరు సమీపంలో విసిరేశాడని పోలీసులు అన్నారు.
ఏం స్కెచ్ వేశాడంటే?
ఇంతకాలం పడక సుఖం ఇచ్చిన దీపా ఇటీవల తనతో మాట్లాడకూడదని, తనకు ఫోన్ చెయ్యకూడదని చెప్పిందని, అందుకే చంపేశానని భీమారాయ్ నేరం అంగీకరించాడని, నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న దీపా అదే కంపెనీలోని కారు డ్రైవర్ తో అక్రమ సంబందం పెట్టుకుని అతని చేతిలోనే హత్యకు గురి కావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications