వామ్మో .. ఎన్నికల ఫలితాలతో హార్ట్ స్ట్రోక్, కాంగ్రెస్ నేత మృతి
లక్నో : ఎన్నికల ఫలితాల టెన్షన్ నేతల్లో ఎక్కువ. కానీ గుండె బలహీనంగా ఉన్న ఓ నేత కౌంటింగ్ కేంద్రం వద్ద .. ప్రాణం తీసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఘటనలో కాంగ్రెస్ నేత రతన్ సింగ్ ఆకస్మికంగా మృతిచెందాడు.
ఫలితాల సందర్భంగా విషాదం ..
ఎన్నికల ఫలితాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో విషాదం జరిగింది. భోపాల్‌లో ఓ కౌంటింగ్ కేంద్రం వద్దకు సిహోర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రతన్ సింగ్ వెళ్లారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర వస్తున్న ట్రెంట్ గురించి తెలుసుకున్నాడు. తమ అభ్యర్థిపై ఓట్ల శాతం చూసి షాక్ తిన్నాడో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. రతన్ సింగ్ చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు తమ ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం రోదిస్తుంది. ఎన్నికల ఫలితాల వేళ ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కును కోల్పోవడం అక్కడున్న వారిని కలచివేసింది.

ఎంపీలో బీజేపీ హవా
మధ్యప్రదేశ్‌లో 29 చోట్ల కమలం వికసించింది. కమల వికసానికి హస్తం కనుచూపుమేరలో లేకుండా పోయింది. ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. గతంలో ఏ కూటమి సాధించని 350 సీట్లు కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. హిందీ బెల్ట్‌లో ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు సాధించింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 సీట్లు గెలుచుకుంది.












Click it and Unblock the Notifications