నదిలో సెల్ఫీ మత్తులో అమ్మాయిలు.. పోటెత్తిన వరద.. పోలీసుల రెస్క్యూ.. వైరల్ వీడియో

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంపులుగా బయటతిరగొద్దని ప్రభుత్వం హెచ్చరించినా వినకుండా పిక్నిక్ బాటపట్టిందో స్నేహబృందం. ఆరుగురు అమ్మాయిలు నది గట్టుమీద కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. అందులో సెల్ఫీ పిచ్చి బాగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు నదిలోకి దికి ఫోజులు పెట్టడం ప్రారంభించారు. అంతలోనే వరద పోటెత్తడంతో వాళ్లిద్దరూ చిక్కుకు పోయారు. దాదాపు ప్రాణాపాయం నుంచి వాళ్లను అతి కష్టంమీదగానీ పోలీసులు కాపాడారు.

మ‌ధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో గల పెంచ్ నదిలో ఈ సంఘటన జరిగింది. గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఆ అమ్మాయిలంతా నదికి సమీపంగా ఉండే బేలాఖేడికి చెందినవాళ్లుగా పోలీసులు గుర్తించారు. న‌దిలోని రాళ్లపై నిలబడి సెల్ఫీలు దిగుతుండగా, వ‌ర‌ద పోటెత్తి వాళ్లు చిక్కుపోవడంతో బయటున్న స్నేహితురాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Madhya Pradesh: girls trapped in Pench river while taking selfie, rescued by police

వెంటనే స్పందించిన పోలీసులు.. గజ ఈతగాళ్లతో సహా పెంచ్ నది వద్దకు చేరుకున్నారు. తాడు సాయంతో అతికష్టం మీద యువ‌తులిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. టెన్షన్ తీరిన తర్వాత అమ్మాయిలందరూ పోలీసులకు థ్యాంక్స్ చెప్పగా, ఇంకోసారి ఇలాంటి దుస్సాహసాలు చేయొద్దని పోలీసులు హితవు చెప్పి వాళ్లను పంపించేశారు.

Recommended Video

    Fact Check : No Lockdown In Vijayawada - Collector || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+