పనికి రాని ప్రశ్నలు అడగకండి.. 8 మంది మృతిపై మంత్రి రియాక్షన్
కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తీస్తుంది. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు. ప్రశ్నిస్తున్న మీడియాపై అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రజల ప్రాణాలు పోవడం ఓ మంత్రికి పనికిరాని ప్రశ్నలా అనిపించింది. కలుషిత తాగు నీటిపై నోరు పారేసుకున్న మంత్రి ఎవరు? అసలు అక్కడేం జరుగుతుంది
భారతదేశంలో "అత్యంత శుభ్రమైన నగరం"గా పేరున్న ఇండోర్‌లో ఇప్పుడు కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తీస్తుంది. చుక్క నీరు తాగినా ప్రాణాలు పోవడం పక్కాగా మారింది. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల్ని పొట్టనబెట్టుకుంది. కలుషిత తాగు నీరు వలన 8 మంది మృతి చెందగా.. 162 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే విషయాన్ని బయటకు పొక్కకుండా చాలా రోజుల మ్యానేజ్ చేసింది అక్కడి ప్రభుత్వం. కానీ నిజం ఎక్కువ రోజులు దాగదు కదా. దీనిపై నేషనల్ మీడియా స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి పట్టణాభివృద్ధి మంత్రిగా వ్యవహరిస్తున్న కైలాశ్ విజయ వర్గియాను ప్రశ్నించింది.
కలుషిత నీరుకు కారణమైన వారిలో కేవలం జూనియర్ అధికారులపైనే ఎందుకు చర్యలు తీసుకున్నారు. సీనియర్ అధికారులపై యాక్షన్ ఎందుకు తీసుకోదని రిపోర్టర్ ప్రశ్నించగా.. "పనికిరాని ప్రశ్నలు అడగకండి" అని బదులిచ్చారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరు బాధ్యత తీసుకోరా అని అడగ్గా.. మంత్రి ఆగ్రహంతో దుర్భాషలాడారు.
Never expected any Indian Journalist to give it back to someone as powerful as Kailash Vijayvargiya, Amit Shah's man.
— Mohammed Zubair (@zoo_bear) December 31, 2025
Seeing this video of an Indian Journalist questioning and holding power accountable brings hope. @Anurag_Dwary ✊ pic.twitter.com/q8ZrvuRVjf
మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందలేదు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల కుటుంబాలకు ఇంకా వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ అందలేదు. వైద్య బిల్లుల భారంతో ఇబ్బందులు పడుతున్నారని రిపోర్టర్ నిలదీయ్యగా కైలాష్ అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయారు.

మరో వైపు కైలాష్ పై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 70 ఏళ్ల నంద్‌లాల్ పాల్ కలుషిత నీరు తాగి మృతి చెందగా.. స్థానిక నేతలు ఆయన కుమారుడికి ఫోన్ చేసి వెళ్లి మంత్రి గారిని కలవడం ఆయన మిమ్మల్ని పరామర్శిస్తారు అని చెప్పడం వివాదాలకు తెరలేపింది. "మన సంస్కృతిలో ఎవరు చనిపోతే వారి ఇంటికి వచ్చి సంతాపం తెలుపుతారు. నేను మూడు రోజులు ఇంటిని వదిలి వెళ్లలేను. అలాంటప్పుడు ఎవరినైనా కలవడానికి ఎలా పరుగులు తీయగలను? చికిత్సకు రూ.40,000కుపైగా ఖర్చు చేశాను. ప్రభుత్వాసుపత్రులో సరైన వైద్యం అందడం లేదు" అన్నారు.
విచిత్రమేమిటంటే, 2021లోనే ఇండోర్‌ను భారత్‌లో తొలి "వాటర్ ప్లస్" నగరంగా ప్రకటించారు. మురుగు నీటిని సమర్థంగా నిర్వహించడం, శుద్ధి చేయని మురుగు నదుల్లోకి వెళ్లకుండా ఆపడం, శుద్ధి చేసిన నీటిని సాగుకు వినియోగించడం వంటి అంశాల్లో ఈ నగరం ప్రశంసలు పొందింది. కానీ నాలుగేళ్ల తర్వాత, వరుసగా ఏడుసార్లు "అత్యంత శుభ్రమైన నగరం"గా నిలిచిన ఇదే ఇండోర్ ఇప్పుడు కలుషిత తాగునీటితో సంభవిస్తున్న మరణాల వార్తల్లో నిలిచింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications