2రోజుల్లో రూ.420కోట్లు కట్టాల్సిందే: కాగ్నిజెంట్‌కు మద్రాస్ హైకోర్టు ఆదేశం
చెన్నై: మద్రాస్, ముంబైలకు చెందిన కంపెనీ ఖాతాలను ఆదాయపన్ను శాఖ నిలిపివేయడంపై కాగ్నిజెంట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దాదాపు 68 బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేయడంతో.. తిరిగి వాటిని పునరుద్దరించాలని విన్నవించుకుంది.
ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బకాయి పడ్డ పన్నులో 15శాతం కట్టాలని ఆదేశించింది. అంటే, దాదాపు రూ.420కోట్లు కాగ్నిజెంట్ ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది కోర్టు.
తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.

పన్ను చెల్లింపు కోసం కాగ్నిజెంట్‌కు చెందిన ముంబై-జేపీ మోర్గాన్ బ్యాంకు ఖాతాను తిరిగి పునరుద్దరించాలని కోర్టు ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. కేవలం ఈ ఒక్క ఖాతాకు మాత్రమే మినహాయింపునిచ్చిన కోర్టు.. మిగతా ఖాతాలు అలాగే స్తంభింపజేసి ఉంటాయని పేర్కొంది.
కాగా, కాగ్నిజెంట్ సంస్థ రూ.2800కోట్లు పన్ను ఎగవతేకు పాల్పడినట్టు ఆదాయపన్ను శాఖ ఇటీవల ఆరోపణలు చేసింది. 2013-16మధ్య కాలంలో డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించలేదని ఆరోపించింది. నోటీసులకు కూడా స్పందించకపోవడంతోనే బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications