మోడీ గొప్ప మేజీషీయన్, ప్రజాస్వామ్యాన్ని అదృశ్యం చేస్తారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద మేజీషీయన్ అని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.ఆ మ్యాజిక్‌తోనే మోడీ ప్రజాస్వామ్యాన్ని కూడ అదృశ్యం చేస్తాడని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బుదవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మేఘాలయలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ఘాటుగా విమర్శలు గుప్పించారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా ఇతర దేశాలకు పారిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఘటనల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప మేజీషీయన్ అని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన వేలి సహయంతో ఏదైనా, కన్పించేలా చేయగలరు, అదృశ్యం చేయగలరని రాహుల్ చెప్పారు.
ఇండియాలో పెద్ద ఎత్తును కుంభకోణాలకు పాల్పడిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు ఇండియా నుండి అదృశ్యమయ్యారని చెప్పారు. కానీ, ఇండియా చట్టాలు కూడ ఏమీ చేయలేని దేశాల్లో వారంతా తలదాచుకొన్నారని చెప్పారు.
మోడీ మేజీషీయన్ ప్రతిభ కారణంగా త్వరలోనే ఇండియాలో ప్రజాస్వామ్యం కూడ అదృశ్యమయ్యే అవకాశం ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ మేఘాలయ రాష్ట్రంలో వరుసగా మూడు దఫాలు రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. అయితే నాలుగోసారి అధికారంలోకి రావాలని ఎదురు చూస్తోందని రాహుల్ చెప్పారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు పాల్పడిన కుంభకోణాలను చూస్తే దేశం నుండి అవినీతిని పారదోలేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నించదని తేటతెల్లమైందన్నారు. ప్రభుత్వమే అవినీతిని పెంచిపోషిస్తోందని అర్ధమౌతోందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
దేశంలో యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడ వైఫల్యం చెందిందన్నారు.
నాలుగేళ్ళు అవుతున్న దేశ ప్రజలకు ఇంకా మంచి రోజులు రాలేదని రాహుల్ సెటైర్ వేశారు. అచ్ఛేదిన్ రాలేదన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ కాలేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని మోడీని రాహుల్ ప్రశ్నించారు. గిరిజనులకు ప్రభుత్వం నమ్మకాన్ని కల్పించలేకపోయిందన్నారు.












Click it and Unblock the Notifications