అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాల్లో భూకంపాలు: భయంతో పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో భూకంపం సంభవించగా.. ఆ తర్వావాత కాసేపటికే అస్సాంలోని తేజ్‌పూర్‌లో భూమి కంపిపంచింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడిరోడ్డుపై నిల్చున్నారు. కొద్ది సెకన్లపాటు కంపించిన భూమి.. ఆ తర్వాత శాంతించింది. కాగా, సింగ్‌భూమ్‌లో మధ్యాహ్నం 2.22 గంటలకు, తేజ్‌పూర్‌లో మధ్యాహ్నం 2.40 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి.

అస్సాంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8 గా నమోదుకాగా.. జార్ఖండ్‌లో 4.1 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. ఇవి స్వల్ప ప్రకంపనలేనని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఎలాటి ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
అసలు ఈ భూకంపాలు ఎందుకు సంభవిస్తాయంటే?
Recommended Video
భూమిలో అనేక పొరలుగా విభజించబడి ఉంటుంది. భూమి లోపల అనేక రకాల పలకలు(ప్లేట్స్)ఉన్నాయి. అయితే, భూమి లోపలి ఉష్ణోగ్రతల కారణంగా.. ప్లేట్లు కొన్నిసార్లు కదులుతుంటాయి. ఆ కారణంగా భూ ప్రకంపనలు సంభిస్తుంటాయి. కొన్నిసార్లు తీవ్రమైన భూకంపాలు సంభిస్తుంటాయి. ఇక భారతదేశంలో భూమి లోపలి పొరల ఆధారంగా భౌగోళికంగా 5 జోన్లుగా విభజించారు. ఆయా మండలాల్లో కొన్ని చోట్లు ఎక్కువగా.. మరికొన్ని చోట్ల తక్కువగానరూ భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. జోన్ 5లో అధికంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 4, 3, 2,1 జోన్లలో స్వల్పంగా వస్తాయి.












Click it and Unblock the Notifications