యోగి ఆదిత్యనాథ్ గొప్ప మనసు.. జైళ్లలో ఉన్న ఖైదీలకూ కుంభమేళా స్నానాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. మంగళవారం సాయంత్రానికి దాదాపు 55 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్ గొప్ప మనసు..
12 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళా కాబట్టి.. సాధ్యమైనంత వరకూ అందర్నీ ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయాలని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలోని ఖైదీలకు ఈ త్రివేణి సంగమం నీటిని అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు 75 జైళ్లలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ఉదయం ఆయా జైళ్లలోని నాళాల్లో సంగమం నీటిని కలుపుతారు. 75 జైళ్లలో ఉన్న దాదాపు 90వేల మంది ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

నదిలో బ్యాక్టీరియా లేదు..
మరోవైపు మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో ప్రాణాంతక మల కోలిఫామ్ బ్యాక్టీరియాను గుర్తించినట్లు సీపీసీబీ తెలపడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. వదంతులు నమ్మొద్దన్నారు. త్రివేణి సంగమం నీళ్లు శుభ్రంగా ఉన్నాయని.. తాగేందుకు కూడా వీలుందన్నారు. అయితే సీపీసీబీ మాత్రం.. మురుగునీటి కాలుష్యానికి సూచిక అయిన మల కోలిఫామ్ బ్యాక్టీరియా పరిమితి 100 మిల్లీలీటర్లకి 2500 యూనిట్లు ఉంటుందని కానీ ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని నదిలో ఎక్కువగా ఉందని నివేదిక అందించింది.












Click it and Unblock the Notifications