వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ఎన్నికలు: మహాగఠ్బంధన్ అభ్యర్థుల ఖరారు, రేపు అభ్యర్థుల ప్రకటన!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనప్పటికీ.. అటు ఎన్డీఏ గానీ, ఇటు మహాగఠబంధన్ కానీ ఇప్పటి వరకు తమ కూటమి అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, ఇప్పటికే మహాగఠబంధన్ తమ అభ్యర్థుల జాబితాలను తయారు చేసినట్లు, శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీహార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత ఏఎన్ఐతో మాట్లాడుతూ.. సీట్ల పంపకం ఇప్పటికే కొలిక్కి వచ్చిందని, పాట్నాలో శనివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రీయ జనతాదళ్ 145 సీట్లలో పోటీ చేయనుందని, వికాషీల్ ఇన్సాన్ పార్టీకి కూడా అవకాశం కల్పించే ఈ "గ్రాండ్ అలయన్స్" నేత తెలిపారు.

 Mahagathbandhan finalises seat sharing, announcement likely tomorrow

కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం) , సీపీఐ(ఎంఎల్) 30 సీట్లు పోటీ చేసే అవకాశాలున్నాయి. బాల్మికి నగర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ వైపు ఆర్జేడీ, మరోవైపు కాంగ్రెస్ ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

Recommended Video

Bihar Elections 2020 ABP-CVoter Opinion Poll : Nitish-Led NDA To Sweep With 141- 161 Seats

కాగా, ఎన్డీఏ కూడా త్వరలోనే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. అక్టోబర్ 4 లోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి దశ 71 సీట్లకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల ఏర్పాట్లలో భారత ఎన్నికల సంఘం అధికారులు ఉన్నారు. బీహార్ అసెంబ్లీలోని 243 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు కొన్ని సర్వేలు తేల్చాయి. ప్రస్తుతం ఎన్డీఏ సీఎంగా నితీస్ కుమార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ బరిలో ఉన్నారు.

English summary
Bihar Assembly poll nomination has already begun but the two major political alliances -- the NDA and Mahagathbandhan -- till now, have not announced any official candidate. However, sources told ANI that the seat-sharing for 'Mahagathbandhan' has been finalised and is likely to be announced in Bihar tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X