కౌంట్ డౌన్ స్టార్ట్..!!
Mahakumbh 2025: మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ క్రిక్కిరిసిపోతోంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకుంటోన్న జనం గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు.
ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లను దాటింది కూడా. 60 కోట్లకు చేరువ అవుతోంది. ఈ నెల 21వ తేదీ నాటికి 59.31 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉదయం 8 గంటల వరకు 33 లక్షలమంది ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారంటే- భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినంతో ముగియబోతోంది. ఇంకో నాలుగు రోజులే మిగిలివుంది మహా కుంభమేళా సమాప్తి కావడానికి. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది.
ఈ నాలుగు రోజుల్లో కనీసం రెండు కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా శివరాత్రి నాడు మహా కుంభ మేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తోన్న నేపథ్యంలో అఘోరీలు, వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమానికి రానున్నారు.

మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.
భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్‌తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications