Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చేతులు కాలాక- 5 మార్పులు..!!

Mahakumbh 2025 stampede: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.

ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.

Mahakumbh 2025 stampede 5 key changes including VVIP Passes were Cancelled

ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది.

ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్, పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.

ఈ ఘటన పట్ల అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. యోగి ఆదిత్యనాథ్‌తో నాలుగుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

Mahakumbh 2025 stampede 5 key changes including VVIP Passes were Cancelled

దీని తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. అయిదు మార్పులు చేపట్టింది.

1. కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. అన్ని రకాల వాహనాలు కుంభమేళా పరిసరాల్లో ప్రవేశించడాన్ని నిషేధించింది.

2. వీవీఐపీ పాసులు రద్దు: ఎలాంటి ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలను కూడా అనుమతించరు. వీవీఐపీ వాహనాలకూ ఇది వర్తిస్తుంది. అన్ని రకాల మినహాయింపులూ రద్దయ్యాయి.

3. వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు: భక్తుల రాకపోకలు సజావుగా సాగడానికి మహా కుంభ మేళాకు దారి తీసే మార్గాలన్నింట్లోనూ వన్ వే ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పాదాచారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

4. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలపైనా: ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ప్రయాగ్‌రాజ్ జిల్లా సరిహద్దుల్లోనే నిలిపివేస్తారు. వాహనాలనేవీ నగరంలోకి రానివ్వరు.

5. ఫిబ్రవరి 4వ తేదీ వరకు: ఆటోలు, టూ వీలర్లు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాలు ప్రయాగ్‌రాజ్ సిటీలో గానీ, కుంభమేళా జరుగుతున్న ప్రదేశాలకు గానీ, ఘాట్లకు గానీ వెళ్లడాన్ని నిషేధించారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+